Kollywood: మరోసారి డిఫరెంట్ కామెడీ మూవీ తో వస్తున్న శివ కార్తికేయన్

కోలీవుడ్ లో యాంకర్ గా కెరీర్ మొదలు పెట్టి, చిన్న సినిమాలతో హీరోగా ఎదిగి వరుస హిట్లతో ఇప్పుడు తమిళం లో స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు శివ కార్తికేయన్. తెలుగు లో నాని లాగా తమిళం లో ఇతను కూడా సొంత టాలెంట్ తో కష్టపడి వచ్చాడు. సోషల్ మీడియా లో, బయట కూడా సింపుల్ గా ఉండే శివ కార్తికేయన్ మంచి నడవడిక తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్నాడు. తెలుగు లో రెమో సినిమా ని డబ్బింగ్ చేసి ఇక్కడ కూడా మంచి హిట్ కొట్టాడు.

డాక్టర్, డాన్ సినిమాలతో వరుస హిట్లు కొట్టిన శివ కార్తికేయన్ 2022 లో ప్రిన్స్ సినిమాతో ప్రేక్షకులని పలకరించాడు. జాతిరత్నాలు ఫేమ్ అనుదీప్ డైరెక్షన్ లో కామెడి మూవీ గా వచ్చిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అయినా ఆ సినిమా శివ కార్తికేయన్ కు మంచి పేరు తెచ్చిపెట్టింది.

ఇప్పుడు శివ కార్తికేయన్ “అయలాన్” మరో డిఫరెంట్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు. ఆర్. రవి కుమార్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా ను 24AM ప్రొడక్షన్ లో R.D రవి నిర్మిస్తున్నాడు. అయలాన్ సినిమా ఒక సైన్స్ ఫిక్షన్ కామెడీ డ్రామా గా రూపొందుతుంది. తాజాగా మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్ లో శివ కార్తికేయన్ గాల్లో తేలుతున్నట్టు ఉండి, తన వీపుపై ఒక ఏలియన్ ఉన్నట్లుగా ఉంది. ఈ సినిమా లో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుండగా శరత్ కేల్హర్, ఇషా కొప్పికర్, భానుప్రియ, యోగి బాబు ప్రధాన యాత్రల్లో నటిస్తున్నారు. 2023 ద్వితీయార్థం లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు