Tollywood: అరడజను లెక్క.. ఒక్కటే పక్కా..!

Tollywood:

టాలీవుడ్ లో ఈ ఇయర్ హిట్ సినిమాల సంఖ్య చాలా తగ్గిపోయింది. సంక్రాంతి ఘనంగా స్టార్ట్ చేసినా, ఆ తర్వాత నుండి వస్తున్న సినిమాల్లో నెలకు ఒకటో రెండో హిట్స్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. లాస్ట్ మంత్ కూడా “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” సినిమా ఒక్కటే సక్సెస్ అయింది. ఇక అక్టోబర్ నెలని పెద్ద సక్సెస్ తో స్టార్ట్ చేద్దామని ఏకంగా అరడజను సినిమాలు రిలీజ్ ఈ వారం అయ్యాయి.

అయితే ఈ వారం రిలీజ్ అయిన అన్ని సినిమాలు, చిన్న సినిమాలే కావడం విశేషం. అయితే ఇక్కడ ఫీల్ అవ్వాల్సిన పాయింట్ ఏంటంటే ఆరు సినిమాల్లో ప్రేక్షకులని మెప్పించే సినిమా ఒక్కటి మాత్రమే వచ్చింది. ఈ సినిమాలన్నిటిని ఒక్కసారి గమనిస్తే అందులో 4 స్ట్రెయిట్ సినిమాలు, రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.

ముందుగా డబ్బింగ్ సినిమాల్లో ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ఆధారంగా తీసిన 800 సినిమా ప్రేక్షకులని ఏమాత్రం మెప్పించలేకపోయింది. క్రికెట్ కన్నా ఎక్కువగా మురళీధరన్ జీవితం పైనే ఫోకస్ చేయగా, పైగా ఆర్టిస్ట్ లు కూడా తెలుగు వాళ్ళకి తెలిసిన వాళ్ళు లేకపోవడం వల్ల ఈ సినిమా అంతగా ఆడడం లేదు. ఇక మరో సినిమా చిన్నా విషయానికి వస్తే సిద్ధార్థ్ హీరోగా నటించిన ఈ సినిమా కథ పరంగా బాగానే ఉన్నా, స్క్రీన్ ప్లే బోరింగ్ గా సాగడం వల్ల ఆడియన్స్ కి కనెక్ట్ కావడం లేదు. పైగా మార్కెటింగ్ కూడా తెలుగులో పెద్దగా చేయలేదు, కాబట్టి జనాలెవరూ పట్టించుకోవట్లేదు.

- Advertisement -

ఇక తెలుగు సినిమాల్లో స్వాతి మెయిన్ లీడ్ గా నటించిన మంత్ ఆఫ్ మధు బోరింగ్ స్క్రీన్ ప్లే తో ఆకట్టుకోకపోగా, సుధీర్ హీరోగా నటించిన మామ మశ్చీన్ద్ర కూడా డైరెక్టర్ కంఫ్యూజింగ్ గా తీయడంతో అంతగా కనెక్ట్ కావడం లేదు. ఇక కిరణ్ అబ్బవరం నటించిన రూల్స్ రంజన్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ ట్రైలర్ చూసినప్పుడే సగం మంది ఆడియన్స్ సినిమాలో ఏ విషయం లేదని గ్రహించారు. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల్లో కూడా అన్నిటికంటే దారుణమైన టాక్ రూల్స్ రంజన్ కే వచ్చింది.

ఫైనల్ గా “మ్యాడ్” మూవీ. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఎలాంటి హైప్ లేదు. సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా జనాలు పట్టించుకోలేదు. కానీ ట్రైలర్ చూసాకే ఆడియన్స్ లో ఒక్క్కసారిగా పాజిటివిటీ పెరిగి థియేటర్లకు రప్పించింది. కామెడీ డ్రామా గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ ని బాగా మెప్పిస్తుంది. ప్రొడ్యూసర్ నాగ వంశి కూడా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన స్టేట్మెంట్స్ కూడా మ్యాడ్ సినిమాపై హైప్ పెరగడానికి హెల్ప్ అయింది. ఓవరాల్ గా ఈ వీక్ రిలీజ్ అయిన అరడజను సినిమాల్లో పక్కాగా చెప్పాలంటే ఒక్కటే హిట్ అయ్యిందని చెప్పొచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు