Box office: “మ్యాడ్” రచ్చ రెండు రోజులకే టార్గెట్ అవుట్!

Box office:

టాలీవుడ్ లో ఈ మధ్య చిన్న సినిమాల హవా నడుస్తోందన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గానే మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమా బ్లాక్ బస్టర్ కాగా, ఆ తర్వాత వచ్చిన మీడియం రేంజ్ సినిమాలు ఏవి హిట్ కాలేదు. ఇక మళ్ళీ టాలీవుడ్ కి హిట్ ఇవ్వాల్సిన అవకాశం చిన్న సినిమాకే దక్కింది. అదే ‘మ్యాడ్’ సినిమా. అంతా చిన్న హీరోలు నటించిన ఈ కామెడీ డ్రామా అక్టోబర్ 6న రిలీజ్ అయ్యి సూపర్ రెస్పాన్స్ తో దూసుకుపోతుంది.

ఈ సినిమాలో సంగీత్ శోభన్ కామెడీ హైలెట్ గా సాగగా, స్క్రీన్ ప్లే బలంతో జనాల్ని ఆకట్టుకుంటుంది. కళ్యాణ్ శంకర్ దర్శకత్వం కూడా బాగుంది. ఇక మ్యాడ్ రిలీజ్ అయిన ఫస్ట్ డే నే వరల్డ్ వైడ్ గా 95 లక్షలకి పైగా షేర్ సాధించగా, రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో 1.05 కోట్ల షేర్, వరల్డ్ వైడ్ గా 1.45 కోట్ల షేర్ సాధించి దుమ్ము లేపింది.

ఇక మ్యాడ్ సినిమా థియేట్రికల్ బిజినెస్ 2 కోట్ల లోపే ఉండగా, కేవలం రెండు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. రెండు రోజుల్లో మ్యాడ్ వరల్డ్ వైడ్ గా 2.45 కోట్ల షేర్ 4.55 కోట్ల గ్రాస్ సొంతం చేసుకుంది. ఇక మ్యాడ్ సినిమా బయ్యర్లకి ఈ ఆదివారం నుండి కలెక్షన్ల పంట పండనుందని చెప్పవచ్చు. వచ్చే వారం కూడా పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు రిలీజ్ కావడం లేదు కాబట్టి కలెక్షన్ల లెక్క పెరుగుతుంది. ఓవరాల్ గా మ్యాడ్ సినిమా 20 కోట్లకి పైగా గ్రాస్ సాధించే అవకాశం ఉంది.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు