Venkatesh Maha: ఈస్తటిక్ సెన్స్ పనిచేస్తుందా..?

మొదటి ప్రయత్నంలోనే కేరాఫ్ కంచరపాలెం లాంటి ఎక్స్పరిమెంట్ చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు డైరెక్టర్ వెంకటేష్ మహా. ఆ తర్వాత ఉమా మహేశ్వర ఉగ్ర రూపస్య లాంటి రీమేక్ తో హిట్ అందుకొని టేస్ట్ ఉన్న డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకున్నాడు. ప్రస్తుతం వెంకటేష్ మహా అందించిన స్క్రీన్ ప్లేతో రూపొందిన మార్టిన్ లూథర్ కింగ్ సినిమా రిలీజ్ కి సిద్ధంగా ఉంది.
సంపూర్ణేష్ బాబు హీరోగా నటించిన ఈ సినిమా అక్టోబర్ 27న రిలీజ్ కానుంది. ఇదిలా ఉండగా వెంకటేష్ మహా ఓ కథతో చాలా కాలంగా ట్రావెల్ చేస్తున్నాడు. ఆ కథను ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోలకు చెప్పినప్పటికీ ఎవరూ ఫైనలైజ్ చేయలేదు. కథ చెప్పిన ప్రతి ఒక్కరు కొన్ని చేంజెస్ సజెస్ట్ చేయటం, ఆ స్క్రిప్ట్ లో చేంజెస్ చేస్తే కథలోని సోల్ మిస్ అవుతుందని మహా భావించటమే ఇందుకు కారణం.
ఎంతమంది ఎన్ని సజెషన్స్ ఇచ్చినా పట్టించుకోకుండా తన కథ మీద నమ్మకంతో ఉన్న ఈ డైరెక్టర్ రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోకు కూడా కథ వినిపించాడట. కానీ, సేమ్ సీన్ రిపీట్ అయ్యింది. రఙ్కాశేఖర్ కూడా చేంజెస్ చేయమని అడగటంతో అక్కడి నుండి వెనుదిరిగాడట. ప్రతి ఒక్కరికి కథ వినిపించి విసిగిపోయిన మహా ఇక లాభం లేదని భావించి తానే ప్రొడ్యూసర్ గా మారి కొత్త ఆర్టిస్ట్స్ లతో ఈ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. కొత్తవారితో సినిమా చేయటంలో ఆశ్చర్యం లేదు కానీ, ఈ సినిమా ప్రొడ్యూస్ చేయటానికి డైరెక్టర్ ఎంచుకున్న విధానమే ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. హాలీవుడ్ లో బాగా ప్రాచుర్యంలో ఉన్న క్రౌడ్ ఫండింగ్ విధానంలో ఈ సినిమా చేయాలని డిసైడ్ అయ్యాడట మహా.
క్రౌడ్ ఫండింగ్ ప్రాసెస్ లో ఇప్పటిదాకా చాలా మంది షార్ట్ ఫిలిమ్స్ చేసి సక్సెస్ అయ్యారు కానీ, ఫీచర్ ఫిలిమ్ అయితే చేయలేదు. లక్షల్లో అయిపోయే షార్ట్ ఫిలిమ్స్ కి క్రౌడ్ ఫండింగ్ కి వెళ్ళటం పెద్ద రిస్క్ కాకపోవచ్చు కానీ, కోట్లలలో ఆవరసరమయ్యే ఫీచర్ ఫిలిమ్ క్రౌడ్ ఫండింగ్ కి వెళ్ళటం రిస్క్ అనే చెప్పాలి. ఈ ప్రయోగం గనక సక్సెస్ అయ్యిందంటే ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అవుతుందనే చెప్పాలి. ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇచ్చినట్టు తనకున్న “ఈస్థటిక్ సెన్స్” చేస్తున్న ఈ రిస్క్ వెంకటేష్ మహాకి ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో చూడాలి.
Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు