Sreeleela: శ్రీలీల కెరీర్ తో ఆడుకుంటున్న మెగా హీరో… బిగ్ మిస్టేక్

టాలీవుడ్ లో ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరైనా ఉన్నారు అంటే అది శ్రీలీల మాత్రమే. ప్రస్తుతం ఈ బ్యూటీ వరుస సినిమాలతో, బిజీ బిజీ షెడ్యూల్ తో గజిబిజిగా గడిపేస్తోంది. ఒకవైపు సినిమాలు, మరోవైపు చదువు అంటూ క్షణం తీరిక లేకుండా మేనేజ్ చేస్తోంది.

‘పెళ్లి సందడి’ సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల… రవితేజ సరసన హీరోయిన్ గా నటించి “ధమాకా” లాంటి హిట్ కొట్టేసింది. ఆ తర్వాత ‘స్కంద’లో కనిపించినప్పటికీ, ఈ మూవీ అంతగా హిట్ కాలేదు అని చెప్పాలి. అయినప్పటికీ శ్రీలీల ఖాతాలో సూపర్ స్టార్ మహేష్ బాబు ‘గుంటూరు కారం’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, నందమూరి నటసింహం బాలయ్య ‘భగవంత్ కేసరి’ లాంటి బడా సినిమాలన్నీ వచ్చి పడ్డాయి. ఇప్పటికే ‘భగవంత్ కేసరి’ రిలీజ్ కాగా, ఆ సినిమాలో శ్రీలీల పెర్ఫార్మెన్స్ కు మంచి మార్కులు పడ్డాయి. అలాగే సినిమా కూడా హిట్ కావడంతో ఈ బ్యూటీ అదే జోష్ తో తన నెక్స్ట్ సినిమాలన్నీ చేస్తోంది. కానీ ఇప్పుడు రిలీజ్ కు రెడీగా ఉన్న శ్రీలీల నెక్స్ట్ మూవీ గురించే ఆమె అభిమానుల టెన్షన్ అంతా.

మెగా హీరో వైష్ణవ్ తేజ్, శ్రీలీల జంటగా నటించిన ‘ఆదికేశవ’ అనే మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ అయిన ఈ మూవీ శ్రీలీల కెరీర్ కు మైనస్ గా మారే అవకాశం లేకపోలేదు. ఎందుకంటే వైష్ణవ్ తేజ్ ఇంకా స్టార్ హీరోల లిస్టులో చేరలేదు. అలాగే ఈ సినిమాపై టాలీవుడ్ కు పెద్దగా ఆసక్తి లేదు. మెగా ఫ్యాన్స్ సైతం ‘ఆదికేశవ’ మూవీని లైట్ తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ సినిమా రిలీజ్ అయి, బాక్స్ ఆఫీస్ వద్ద బొక్క బోర్లా పడిందంటే, ఆ ఎఫెక్ట్ శ్రీలీల కెరీర్ పై ఎంతోకొంత పడక తప్పదు. దీంతో ఈ మెగా హీరో ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్న శ్రీలీల కెరీర్ తో ఆడుకుంటున్నాడని ఆమె ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాకుండా శ్రీలీల ఫ్యాన్స్ ఆమె ఈ సినిమాను ఒప్పుకుని తన కెరీర్ లోనే బిగ్ మిస్టేక్ చేసిందని అంటున్నారు. మరి ఈ సినిమా రిలీజ్ ఎప్పుడు అవుతుందో? ఆ తర్వాత రిజల్ట్ ఎలా ఉంటుందో? శ్రీలీల కెరీర్ ను ఈ మూవీ ఎంతవరకు ఎఫెక్ట్ చేస్తుందో చూడాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు