BoxOffice: మంగళవారం ఫస్ట్ డే లెక్క.. ఈ జోరు సరిపోదు?

టాలీవుడ్ లో ఈ వారం అన్ని చిన్న సినిమాలే రిలీజ్ అవగా, ఆ సినిమాల్లో “మంగళవారం” ఒకటి. అజయ్ భూపతి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా నటించగా, సస్పెన్స్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా నవంబర్ 17న రిలీజ్ అయ్యి మంచి మిక్సడ్ రెస్పాన్స్ ని తెచ్చుకుంది. ఇక రిలీజ్ అయిన ఫస్ట్ డే మంచి ఓపెనింగ్స్ సాధించడమే గాకుండా హోల్డ్ ని కూడా బాగా చూపిస్తుంది.

మంగళవారం రిలీజ్ అయిన ఫస్ట్ డే తెలుగు రాష్ట్రాల్లో 2 కోట్ల వరకు షేర్ సాధించగా, వరల్డ్ వైడ్ గా 2.30 కోట్ల షేర్ ని వసూలు చేసింది. అయితే 12.50 కోట్ల బిజినెస్ చేసిన మంగళవారం 13 కోట్ల టార్గెట్ తో రిలీజ్ అవగా, వచ్చిన వసూళ్లు తీసేస్తే బ్రేక్ ఈవెన్ అవ్వడానికి ఇంకా 10.70 కోట్ల వరకు కలెక్ట్ చేయాలి. అయితే టాక్ ని బట్టి లాంగ్ రన్ లో బాగా ఆడితే, మంగళవారం ఈజీ గా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ ఉంది.

అయితే మంగళవారం సినిమాలో ఏ సెర్టిఫికెట్ సినిమా అవడం వల్ల ఏ సెంటర్ల ప్రేక్షకులు ఎక్కువగా చూడలేరు. సినిమాలో వైలెన్స్ కూడా ఆ విధంగా ఉంది. పైగా ఆదివారం వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఎఫెక్ట్ కూడా పడనుంది. అందుకే మంగళవారం ఈ వీకెండ్ లో కనీసం 70 శాతం వరకైనా బ్రేక్ ఈవెన్ అయితే ఓవరాల్ గా హిట్ దిశగా వెళ్లే ఛాన్స్ ఉంది. ఇక మంగళవారం సినిమాతో పాటు ఇతర సినిమాలు రిలీజ్ అయినా, ఆ సినిమాలకి నెగిటివ్ టాక్ రావడం మంగళవారానికి కలిసొచ్చే అంశం.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు