Siddharth: హాట్ స్టార్ పై గుర్రుగా ఉన్న సిద్ధార్థ్ ఫ్యాన్స్… మినిమిం కామన్ సెన్స్ లేదా?

యంగ్ హీరో సిద్ధార్థ్ ఫాన్స్ బిగ్గెస్ట్ ఓటిటి ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ పై గుర్రుగా ఉన్నారు. పైగా మీకు మినిమం కామన్ సెన్స్ లేదా ? అంటూ తిట్టిపోస్తున్నారు. మరి వీరికి ఇంత కోపం వచ్చేలా హాట్ స్టార్ ఏం చేసింది? అంటే… ఇటీవల విడుదలైన సిద్ధార్థ్ మూవీ హాట్ స్టార్ ప్రకారం ఇప్పటికే రిలీజ్ కావాల్సి ఉంది. కానీ ఈ దిగ్గజ ఓటిటి ప్లాట్ఫామ్ మాత్రం దాన్ని పోస్ట్ పోన్ చేసింది. పైగా సినిమా స్ట్రీమింగ్ ను పోస్ట్ పోన్ చేస్తున్న విషయం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వనేలేదు.

ఇక విషయంలోకి వెళ్తే… సిద్ధార్థ్ హీరోగా, నిమిషా సజయం హీరోయిన్ గా నటించిన క్రైం థ్రిల్లర్ మూవీ ‘చిన్నా’. సహస్ర శ్రీ అనే పాప ఈ సినిమాలో కీలక పాత్ర పోషించింది. సినిమా మొత్తం ఈ చిన్న పాప చుట్టూనే తిరుగుతుంది. ఓ సైకో కిల్లర్ చిన్న పిల్లలను ఎత్తుకెళ్ళి, రేప్ చేసి మరీ చంపుతూ ఉంటాడు. ఒకానొక సందర్భంగాలో హీరో తన మేనకోడలు ఫ్రెండ్ ను రేప్ ను చేసినట్టు నింద పడుతుంది. హీరో ఆ పరిస్థితులను ఎలా పేస్ చేసి, ఆ నిందితుడిని పట్టుకున్నాడు? అనే ఆసక్తికర అంశంతో ‘చిన్నా’ కథ తెరకెక్కింది. తమిళంలో సెప్టెంబర్ 28న, తెలుగులో అక్టోబర్ 6న ఈ మూవీ రిలీజ్ అయింది. యావరేజ్ టాక్ తో థియేటర్లలో నడిచిన ఈ మూవీ ఓటిటి, శాటిలైట్ రైట్స్ తో మేకర్స్ మంచి లాభాలు జేబులో వేసుకున్నారు.

ఇక ఓటిటి రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ సొంతం చేసుకోగా, ‘చిన్నా’ మూవీని నవంబర్ 17 నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు ఇంతకుముందు అఫీషియల్ గా ప్రకటించారు. ఇక పాజిటివ్ మౌత్ టాక్ తో మంచి పబ్లిసిటీ సొంతం చేసుకున్న ఈ మూవీకి విమర్శకుల ప్రశంసల సైతం అందాయి. దీంతో ఈ మూవీ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అని సిద్ధార్థ్ అభిమానులతో పాటు సినీ ప్రియులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అయితే నిన్ననే స్ట్రీమింగ్ అవ్వాల్సిన ‘చిన్నా’ మూవీ, హాట్ స్టార్ ప్రకటించిన టైం దాటి 24 గంటలు గడిచిపోతున్నా కూడా స్ట్రీమింగ్ అవ్వలేదు.

- Advertisement -

పైగా ఈ విషయం గురించి హాట్ స్టార్ నిర్వాహకులు ఉలుకూ పలుకూ లేకుండా ఉన్నారు. దీంతో ఇలా తెలుగు, తమిళ ప్రేక్షకులను నిరాశ పరచడమే కాకుండా, కనీసం ఎలాంటి అప్డేట్ ఇవ్వకుండా ఉన్న హాట్ స్టార్ పై అభిమానులు మండిపడుతున్నారు. అందులో భాగంగానే ఈ ఓటిటి ప్లాట్ఫామ్స్ కొన్ని సౌత్ ప్రేక్షకులను తక్కువగా చూస్తున్నాయి అంటూ హాట్ స్టార్ పై సోషల్ మీడియాలో రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు