siddharth: తనని తాను రోడ్ సైడ్ చెత్త తో పోల్చుకున్నా హీరో సిద్దార్థ్

హీరో సిద్దార్థ్ పరిస్థితి రోజు రోజుకు మరి దారుణంగా తయారవుతుంది. ఒకప్పుడు స్టార్ హీరోగా టాలీవుడ్ లో ఉన్న ఫ్యామిలీ హీరోలందరికీ కాంపిటీషన్ గా ఉండే సిద్దార్థ్, ఇటీవల కాలంలో సినిమాలేవీ లేక స్టేజ్ పైనే అవకాశాలు అడుక్కునే పరిస్థితి ఏర్పడింది.

సిద్దార్థ్ నటించిన లేటెస్ట్ సినిమా చిన్న ప్రమోషన్స్ లో భాగంగా తనలోని ఆవేదన ను ప్రేక్షకులతో పంచుకున్న సిద్దార్థ్ లేటెస్ట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను తాను చెత్త తో పోల్చొని అందరిని ఆశ్చర్య పరుస్తున్నాడు. సిద్దార్థ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా చిత్త సినిమా కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించి ఫిలిం ఆఫ్ ది ఇయర్ గా నిలిచింది. అలాగే కమర్షియల్ గా ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లను రాబట్టింది. తమిళ్ లో సినిమా సూపర్ హిట్ అవడంతో సిద్దార్థ్ కాన్ఫిడెన్స్ గా ఈ సినిమాను తెలుగులో చిన్న పేరుతో రిలీజ్ చేసాడు.

అయితే కంటెంట్ పరంగా ఈ చిన్న సినిమా మంచి చిత్రమే అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులు మాత్రం చిన్న ను పెద్దగా ఆదరించలేదనే చెప్పాలి. రివ్యూస్ పరంగా చిన్న సినిమాకు విమర్శకుల నుంచి భారీ ఎత్తున ప్రశంషలు వచ్చిన కూడా సిద్దార్థ్ పేరు మాత్రం గట్టిగ వినిపించలేదు.

- Advertisement -

ఇక సిద్దార్థ్ లేటెస్ట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చిన్న సినిమాలోని హీరో ఇంట్రడక్షన్ గురించి చెబుతూ చెత్త బండి ని చూపిస్తూ హీరో ఎంట్రీ ఉంటుందని వివరించాడు. అయితే అలా చూపించాడని కారణం చిన్న సినిమాను చూసినపుడు ప్రేక్షకులను రియాలిటీ ఫీలింగ్ ను కలిగించడమే అని తన ఉద్దేశ్యాన్ని చెప్పాడు. ఇలా సిద్దార్థ్ తన స్థాయిని ఎంతగా తగ్గించుకొని చిన్న సినిమాను ప్రమోట్ చేస్తున్న కూడా ఈ సినిమా ఆశించినంత రేంజ్ లో ఆదరణ రాకపోవడం నిజంగా బాధాకరమైన విషయమనే చెప్పాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు