PayalRajputh: “మంగళవారం” బిజినెస్ లెక్క.. టార్గెట్ పెద్దదే?

టాలీవుడ్ లో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో “మంగళవారం” ఒకటి. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా నటించిందన్న సంగతి తెలిసిందే. ఇక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ట్రైలర్స్ తో మంచి క్రేజ్ తెచ్చుకుని నవంబర్ 17న రిలీజ్ కి రెడీ అవుతుంది. ఇక మంగళవారం సినిమాకి సంబంధించి బిజినెస్ ఇంకా బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్ బయటికి వచ్చాయి.

మంగళవారం తెలుగు రాష్ట్రాల్లో ఊహించిన దానికంటే బాగానే బిజినెస్ చేసిందని చెప్పొచ్చు. ముందుగా నైజాం లో 3.20 కోట్లు బిజినెస్ చేయగా, ఆంధ్ర మరియు సీడెడ్ కలిపి 7 కోట్లు, టోటల్ గా తెలుగు రాష్ట్రాల్లో 10.20 కోట్ల వరకు బిజినెస్ చేసిందని సమాచారం. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ తో కలిపి మరో 2 కోట్ల వరకు వాల్యూ బిజినెస్ ను సొంతం చేసుకున్న “మంగళవారం” సినిమా టోటల్ వరల్డ్ వైడ్ గా 12.20 కోట్ల బిజినెస్ చేసింది.

అంటే మంగళవారం బిజినెస్ టార్గెట్ అందుకోవాలంటే 13 కోట్ల వరకు షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అయితే సినిమా పై ఉన్న క్రేజ్ కి మంచి టాక్ గనుక తెచ్చుకుంటే “మంగళవారం” సినిమా మొదటి వారం కూడా పూర్తవకుండానే బ్రేక్ ఈవెన్ అయిపోవడం ఖాయం. అయితే ఈ సినిమాకి పోటీగా పలు చిన్న సినిమాలు కూడా రిలీజ్ అవుతుండడం వల్ల మంగళవారానికి పాజిటివ్ టాక్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పాలి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు