Mangalavaram: కంటెంట్ ని బాగా నమ్మారు… అందుకే ప్రీమియర్లకి సై!

టాలీవుడ్ లో ఈ మధ్య తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రీమియర్ సినిమాల హడావిడి ఎక్కువైంది. అంటే ఓవర్సీస్ లో లాగా రిలీజ్ కి ముందు రోజు నుండే కొన్ని థియేటర్లలో సినిమా ప్రదర్శించడం. కొన్ని నెలల కిందట రిలీజ్ అయిన “సామజవరగమన” సినిమా అలాగే రిలీజ్ కి రెండు రోజుల ముందు నుండే తెలుగు రాష్ట్రాల్లో పేరున్న పలు థియేటర్లలో ప్రీమియర్ షో ల ద్వారా ప్రదర్శితమైంది. ఒక రకంగా ఆ మౌత్ టాక్ వల్లే సామజవరగమనా సినిమాకి పాజిటివ్ బజ్ పెరిగి బ్లాక్ బస్టర్ అయిందని చెప్పొచ్చు.

అలాగే మూడు నెలల కిందట రిలీజ్ అయిన “బేబీ” సినిమా కూడా రిలీజ్ కి ముందే హైదరాబాద్ లో పలు థియేటర్లలో ప్రీమియర్ షోల ద్వారా ప్రదర్శితమైంది. ఇప్పుడు ఇదే కోవలో ప్రీమియర్లకి సిద్ధమైన మరో సినిమా “మంగళవారం”. ఈ సినిమా రిలీజ్ ముందు నుండే ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ అవగా, ఇప్పుడు సిటీలో కొన్ని ప్రముఖ థియేటర్లలో ప్రీమియర్ షో లో వేయనున్నట్టు మేకర్స్ తెలియచేసారు.

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్స్ తో మంచి క్రేజీ బజ్ ని దక్కించుకున్న మంగళవారం, ప్రీమియర్ టాక్ గనుక బాగా వస్తే బేబీ సినిమాకి జరిగినట్టు ఈ సినిమాకి కూడా మౌత్ టాక్ చాలా ప్లస్ అవుతుంది. ఇక మేకర్స్ ని కూడా కంటెంట్ ని బాగా గట్టిగా నమ్మినట్టున్నారు. అందుకే రిలీజ్ కి ముందే ప్రీమియర్లకి సై అంటున్నారు. అటు నెటిజన్లు ఇంత నమ్మకంగా ప్రీమియర్లు కూడా వేస్తున్నారంటే మేకర్స్ కంటెంట్ ని ఎంత నమ్మారో అని తమ అభిప్రాయాన్ని పాజిటివ్ గా తెలియచేస్తున్నారు.

- Advertisement -

ఇక ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో కూడా దీనికంటే ఎక్కువ బజ్ ఉన్న సినిమా లేదు కాబట్టి అది మంగళవారానికి ప్లస్ అవనుంది. మరి థియేటర్లో రిలీజ్ అయ్యాక సామజవరగమన, బేబీ సినిమాల ప్రీమియర్ సెంటిమెంట్ ని మంగళవారం రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు