Prabhas’s Salaar: సంక్రాంతికి సవాళ్లు విసురుతున్న సలార్

క్రాంతికి పెద్ద పెద్ద సినిమాలన్నీ క్యూలో ఉన్నాయి. దాదాపుగా ఆరు నుంచి ఏడు తెలుగు సినిమాలు వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోకి మేం దిగబోతున్నామంటూ ఇప్పటికే ప్రకటించేశారు. ఒక్కరు కూడా వెనక్కి తగ్గే ఆలోచనలో లేనే లేరు. ప్రస్తుతానికి మహేష్ బాబు ‘గుంటూరు కారం’, మాస్ మహారాజ రవితేజ ‘ఈగల్’, కింగ్ నాగార్జున రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘నా సామి రంగ’, సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’, విక్టరీ వెంకటేష్ ‘సైంధవ్’, ఇక ఫాంటసీ మూవీ ‘హనుమాన్’ వంటి సినిమాలన్నీ సంక్రాంతి బరిలోకి దిగబోతున్నాయి. ఇందులో కొన్ని సినిమాలు పోస్ట్ పోన్ కాబోతున్నాయని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. అందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ, వచ్చే సినిమాలపై మాత్రం ప్రభాస్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘సలార్’ ఎఫెక్ట్ గట్టిగానే ఉండబోతోంది.

నిజానికి ‘సలార్’ మూవీ డిసెంబర్ 22న రాబోతోంది. అయితే ఈ మూవీ మోస్ట్ అవెయిటింగ్ యాక్షన్ ఎంటర్టైనర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. పైగా ప్యాన్ ఇండియా రేంజ్ లో రాబోతోంది. అటు మన ప్రభాస్ కు ఉన్న క్రేజ్, ఇటు ‘కేజిఎఫ్’లాంటి అద్భుతమైన సినిమాలు అందించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కు ఉన్న క్రేజ్ నెక్స్ట్ లెవెల్. మరి వీరిద్దరి కాంబోలో వస్తున్న సినిమా అంటే అంచనాలు ఆకాశాన్ని తాకడంలో ఏమాత్రం తప్పులేదు. ఇక ప్రస్తుతం ప్రభాస్ ఆశలన్నీ కూడా ఈ సినిమా పైనే ఉన్నాయి. ఒకవేళ ‘సలార్’ కనుక హిట్ టాక్ తెచ్చుకుంటే సంక్రాంతి సినిమాలకు పక్కలో బల్లెంగా మారే చాన్స్ ఉంది.

సంక్రాంతి సినిమాల రిలీజ్ కు, ‘సలార్’ మూవీ రిలీజ్ కు చాలా గ్యాప్ ఉన్నప్పటికీ, సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చి, ‘కేజిఎఫ్’ లాంటి ఫీవర్ ప్రేక్షకులకు పట్టుకుందంటే ఇక సంక్రాంతి బరిలో నిలిచిన మన టాలీవుడ్ స్టార్స్ అందరికీ తలనొప్పి స్టార్ట్ అయినట్టే. నిజానికి సౌత్ లో చాలావరకు థియేటర్స్ అన్నిటిని ‘సలార్’ ఆక్రమించేస్తుంది. ఇక సంక్రాంతికి రిలీజ్ కానున్న సినిమాలకు డిస్ట్రిబ్యూటర్లు థియేటర్లు ఎలా అడ్జస్ట్ చేయబోతున్నారు అన్న విషయం ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే ఉంది. అసలే సంక్రాంతికి రిలీజ్ అయ్యే సినిమాలకు థియేటర్స్ తక్కువగా ఉన్నాయి అని అనుకుంటుంటే, మరోవైపు డబ్బింగ్ సినిమాలు దండయాత్ర చేయడానికి రెడీ అవుతున్నాయి. ‘సలార్’ మూవీ గనక హిట్ అయితే ఇక్కడ థియేటర్స్ ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. మరి ఇలాగైతే ‘సలార్’ సంక్రాంతి సినిమాలకు సవాల్ విసిరినట్టే.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు