Tollywood: ఈ వారం రిలీజ్ అవుతున్న అరడజను సినిమాలు.. ఫోకస్ ఆ సినిమాపైనే?

టాలీవుడ్ లో ప్రతి వారం చాలా సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అయితే గత నెలరోజులుగా చిన్న సినిమాలే ఎక్కువగా థియేటర్లలో రిలీజ్ అవుతున్నాయి. ఇక హిట్ అవ్వడం ఆడియన్స్ చేతుల్లో ఉందనుకోండి? గత వారం కేవలం డబ్బింగ్ సినిమాలే రిలీజ్ అవ్వగా, అందులో కూడా ఏ సినిమా కూడా ఆకట్టుకోలేదు. కానీ ఈ వారం అరడజనుకి పైగా సినిమాలు రిలీజ్ కావడానికి సిద్ధం అవుతున్నాయి. అన్ని చిన్న సినిమాలే కాగా, బజ్ పరంగా మాత్రం కొన్ని సినిమాలపైనే ఉంది. అయితే రాబోయే సినిమాలన్నీ నవంబర్ 17న రిలీజ్ అవ్వనున్నాయి.

అయితే ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో మంచి క్రేజీ బజ్ తో రిలీజ్ అవుతున్న సినిమా “మంగళవారం”. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా నటించింది. ఇక ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కగా, టీజర్, ట్రైలర్స్ తో ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేసుకుంది.

ఈ వారం రిలీజ్ అయ్యే సినిమాల్లో కన్నడ డబ్బింగ్ సినిమా సప్త సాగరాలు దాటి సైడ్ బి కూడా ఒకటి. రక్షిత్ శెట్టి హీరోగా నటించిన ఈ ఎమోషనల్ డ్రామా పార్ట్ వన్ లాస్ట్ మంత్ రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకోగా, లౌ ప్రమోషన్స్ వల్ల థియేటర్లలో అంతగా ఇంపాక్ట్ చూపలేదు. కానీ ఓటిటి లో హిట్ అయ్యి ఇప్పుడు రెండో పార్ట్ రిలీజ్ కి సిద్ధం అయింది. ఏ సెంటర్ల ప్రేక్షకులు ఈ సినిమాకి బాగా కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది.

- Advertisement -

ఇక మిగతా సినిమాల్లో కొత్త నటుడు విక్రాంత్ హీరో గా పరిచయమవుతున్న “స్పార్క్” భారీ బడ్జెట్ తో తెరకెక్కినా, హీరో అంతగా ఆకట్టుకునేలా లేడని ట్రోలింగ్ జరుగుతుంది. పైగా ప్రమోషన్లు కూడా ఎంత చేసినా జనాల్ని ఆకట్టుకోలేదు. కానీ కంటెంట్ బాగుంటే సినిమాని కూడా హిట్ అవ్వకుండా ఎవ్వరు ఆపలేరు. ఆక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

ఇక అనన్య నాగళ్ళ మెయిన్ లీడ్ గా నటించిన “అన్వేషి” కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా కూడా జనాలని మెప్పిస్తుందా అంటే టాక్ పైనే డిపెండ్ అయ్యి ఉంది. ఇక చాలా రోజుల తర్వాత హన్సిక హీరోయిన్ గా నటించిన “మై నేమ్ ఈజ్ శృతి” సినిమా కూడా ఈ వారమే రిలీజ్ అవుతుంది. ఇవే గాక జనం, ఏ చోట నువ్వున్నా అనే చిన్న సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో కొన్ని సినిమాల గురించి ఆడియన్స్ కి కూడా తెలీదు.

ఇవన్నీ గాకుండా జూనియర్ ఎన్టీఆర్ నటించిన అదుర్స్ సినిమా రీ రిలీజ్ కూడా ఈ వారమే నవంబర్ 18న రిలీజ్ అవుతుంది. మరి రిలీజ్ అయ్యే సినిమాల్లో ఏ సినిమా మంచి టాక్ తో అలరిస్తుందో తెలియాలంటే నవంబర్ 17వరకు వెయిట్ చేయాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు