Surekhavani: ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ వేళ సురేఖవాణి పోస్ట్ వైరల్..ఇంతకీ ఏం చేసిందంటే..?

టాలీవుడ్ లోని పాపుల‌ర్ క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుల్లో సురేఖ‌వాణి కూడా ఒక‌రు. మొద‌ట టీవీ సీరియ‌ల్స్ న‌టించిన సురేఖ‌వాణి ఆ త‌రవాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. సినిమాల్లో స‌హాయ న‌టిగా ఎంతో గుర్తింపు సంపాదించుకుంది. అక్క‌, వ‌దిన లాంటి పాత్ర‌ల‌కు ఎక్కువ డిమాండ్ ఉండ‌టంతో అలాంటి పాత్ర‌ల‌లోనే ఎక్కువ‌గా కనిపించి మెప్పించింది.

అంతే కాకుండా హీరో హీరోయిన్ల‌కు త‌ల్లి పాత్ర‌ల్లోనూ సురేఖ న‌టిస్తూ ఉంటుంది. చాలా సినిమాల్లో బ్ర‌హ్మానందంకు భార్య న‌టించి కామెడీ చేయ‌డం కూడా విశేషం. అయితే సురేఖ‌వాణి స‌హాయ న‌టి అయిన‌ప్ప‌టికీ గ్లామ‌ర్ లో మాత్రం హీరోయిన్ల‌కు త‌క్కువేమీ కాదు. త‌న గ్లామ‌ర్ ఫోటోల‌ను షేర్ చేస్తూ సోష‌ల్ మీడియాలో ల‌క్షల్లో అభిమానుల‌ను సంపాదించుకుంది. ఇక సురేఖ‌వాణి కూతురు సుప్రీత కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌కుండానే సోష‌ల్ మీడియా స్టార్ అయిపోయింది. సురేఖ రేంజ్ లోనే సుప్రీత కూడా ఫాలోవ‌ర్ల‌ను సంపాదించుకోవ‌డం విశేషం.

ప్ర‌స్తుతం సుప్రీత మోడ‌లింగ్ లో రానిస్తోంది. హాట్ హాట్ ఫోటోల‌ను షేర్ చేస్తూ కుర్రాళ్ల మ‌తులు పోగొడుతోంది. దాదాపు ఈ అమ్మ‌డికి ఎనిమిది ల‌క్ష‌ల ఫాలోవ‌ర్లు ఉన్నారంటే ఏ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకుందో అర్థం చేసుకోవ‌చ్చు.

- Advertisement -

ఇక వీరిద్ద‌రూ క‌లిసి ప‌బ్ ల‌కు పార్టీల‌కు వెళ్ల‌డం అంద‌రికీ తెలిసిందే. సురేఖ కూతురుతో క‌లిసి ప‌బ్ లో ఎంజాయ్ చేసే వీడియోల‌ను షేర్ చేస్తుండ‌టంతో కొన్నిసార్లు ట్రోల్స్ బారిన కూడా ప‌డాల్సి వ‌చ్చింది. ఇదిలా ఉంటే త‌ర‌చూ విదేశాలకు వెళ్లే సురేఖ‌వాణి ప్ర‌స్తుతం న్యూజిలాండ్ కు వెళ్లింది. అక్క‌డ ఓ స్పాలో ఎంజాయ్ చేస్తున్న వీడియోను సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. అంతే కాకుండా తాను ఇండియా న్యూజిలాండ్ మ్యాచ్ ను న్యూజిలాండ్ లో చూస్తున్నాను అంటూ వీడియోలో చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం సురేఖ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు