Avika Gor: అవికా గోర్ ని ఆ హీరో నిజంగానే టార్చర్ చేశాడా..?

చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తో ఎంతగానో ఫేమ్ తెచ్చుకున్న నటి అవికా గోర్ గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయాలు అక్కర్లేదు. చిన్నారి పెళ్ళికూతురు సీరియల్ తరువాత అవికా.. రాజ్ కుమార్ ఆర్యన్, ససురాల్ సిమర్ కా అనే సీరియల్స్ లో నటించింది. సీరియల్స్ లో మాత్రమే కాకుండా హిందీ సినిమాలలోనూ బాలనటిగా నటించింది ఈ ముద్దుగుమ్మ. ఆ తర్వాత ఉయ్యాల జంపాల సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా అడుగు పెట్టింది. ఈ సినిమా తరువాత లక్ష్మి రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికి పోతావు చిన్నవాడా లాంటి చిత్రాలలో నటించి మెప్పించింది.

ఇక ఈ ఏడాది పాప్ కార్న్ అనే సినిమాతో ప్రేక్షకులను అలరించింది. తాజాగా మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ఓటిటి అభిమానులను అలరించేందుకు వస్తోంది. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ స్టార్ హీరో అవికా గోర్ ని లైం*** వేధించాడంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ హీరో మరెవరో కాదు నిఖిల్ సిద్ధార్థ్. అవికా – నిఖిల్ కాంబినేషన్ లో ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే సినిమా తెరకెక్కిన విషయం తెలిసిందే. గతంలో నిఖిల్ లైం** వేధించాడు అంటూ అవిక ఫిలిం ఇండస్ట్రీకి చెందిన కొంతమంది ఉన్న వాట్సాప్ గ్రూపులో ఆడియో మెసేజ్ లు, నార్మల్ మెసేజ్ లు, స్క్రీన్ షాట్ చేసి పెట్టిందట.

ఈ గ్రూపులో సాయి ధరంతేజ్, వరుణ్ తేజ్, హెబ్బా పటేల్, రకుల్ ప్రీత్ సింగ్ వంటి మరి కొంతమంది సెలబ్రిటీలు కూడా ఉన్నారట. అయితే ఆమె ఈ మెసేజ్ లని అలా వాట్సప్ గ్రూప్ లలో షేర్ చేయడంతో ఆమెని వెంటనే గ్రూప్ నుండి రిమూవ్ చేశారట. దీంతో అవికా మీడియాలో తన బాధను వెళ్లగక్కింది. కానీ నిఖిల్ పేరుని మాత్రం ఎక్కడా ప్రస్తావించలేదు. దీంతో ఆమె పరోక్షంగానే నిఖిల్ ని ఉద్దేశించి కామెంట్స్ చేసిందని అంతా భావించారు. అంతేకాదు ఎక్కడికి పోతావు చిన్నవాడా అనే మూవీలో మెయిన్ హీరోయిన్ అవిక అయినప్పటికీ ఆమె పాత్రను తగ్గించి మిగిలిన ఇద్దరు హీరోయిన్ల పాత్ర ఎక్కువ కనిపించేలా నిఖిల్ చేశాడనే రూమర్ కూడా అప్పట్లో చెక్కర్లు కొట్టింది. కానీ ఇందులో నిజం ఎంత అనేది మాత్రం తెలియదు.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు