Mangalavaram: బయ్యర్ల ఆశలన్నీ ఈ సినిమా పైనే?

టాలీవుడ్ లో ఈ మధ్య పెద్ద సినిమాల కంటే చిన్న సినిమాలే అదరగొడుతున్నాయి. ఎన్నో ఆశలు పెట్టుకున్న స్టార్ హీరోల సినిమాలు తుస్సుమంటుంటే ఏ అంచనాలు లేకుండా వచ్చిన చిన్న సినిమాలు మాత్రం బ్లాక్ బస్టర్స్ అవుతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన పొలిమేర2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిందే. పోటీగా కీడా కోలా లాంటి క్రేజీ సినిమా ఉన్నా కూడా మౌత్ టాక్ తో దుమ్ము లేపింది.

అయితే ఇప్పుడు మరో చిన్న సినిమా కూడా బయ్యర్ల దృష్టిని అలాగే ఆకర్షించింది. ఒక రకంగా తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఆ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నారు. ఆ సినిమాయే “మంగళవారం”. RX100 ఫేమ్ అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఈ సినిమా ఒక సస్పెన్స్ థ్రిల్లర్ గా తెరకెక్కింది. పాయల్ రాజపుత్ మెయిన్ లీడ్ గా నటించిన మంగళవారం, టీజర్, ట్రైలర్, సహా సాంగ్స్ కూడా ఆకట్టుకోవడంతో సినిమాపై ఆడియన్స్ లో భారీ అంచనాలున్నాయి.

ఇక రెండు వారాల కింద రిలీజ్ అయిన కీడా కోలా నిరాశ పరచడం, అలాగే ఈ దీపావళికి రిలీజ్ అయిన జపాన్, జిగర్ తండా2 డిజాస్టర్లు కావడం వల్ల ఆడియన్స్ తో పాటు, బయ్యర్ల ఆశలన్నీ కూడా మంగళవారం సినిమాపైనే ఉన్నాయి. ఇక రీసెంట్ గా అల్లు అర్జున్ గెస్ట్ గా గ్రాండ్ గా మంగళవారం ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా జరిగింది. నవంబర్ 17న రిలీజ్ అవుతున్న ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో బయ్యర్లు పెద్దమొత్తంలో డబ్బు చెల్లించి కొనుగోలు చేసారని తెలుస్తుంది. ఎందుకంటే గతంలో వచ్చిన బలగం, బేబీ, ఇప్పుడు పొలిమేర చిన్న సినిమాలుగా వచ్చి భారీ లాభాలు అందుకున్నాయి.

- Advertisement -

అదే కోవలో మంగళవారం కూడా బయ్యర్లకి భారీ లాభాలు అందిస్తుందేమోనని ఆశపడుతున్నారు. మరి పొలిమేర సినిమాలాగే ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ అయ్యి బయ్యర్లకి లాభాలు తెస్తుందో లేదో చూడాలి.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు