Swathi Reddy: ఛీ ఇండస్ట్రీ అంటేనే వరస్ట్… ఆ వీడియోపై స్వాతి సెన్సేషనల్ కామెంట్స్

కలర్స్ అనే ప్రోగ్రాంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చి, ఆ తర్వాత హీరోయిన్ గా మారింది స్వాతి. ఇక అప్పటినుంచి ఇప్పటిదాకా వైవిధ్యమైన సినిమాలను ఎంచుకుంటూ, నటనకు మాత్రమే ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేస్తూ తెలుగు ప్రేక్షకుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఇక కలర్స్ ప్రోగ్రాం తో ఈ బ్యూటీ పాపులర్ అవడంతో ఆమె పేరుకు ముందు కలర్స్ అనేది గుర్తింపుగా మారిపోయింది. అందుకే అందరూ ఆమెను కలర్స్ స్వాతి అని పిలుస్తూ ఉంటారు. యాంకర్ గా కెరియర్ను స్టార్ట్ చేసిన ఈ భామ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా… ఇలా తనలోని మల్టీ టాలెంట్ ను బయట పెడుతూ అందరినీ ఆకట్టుకుంది.

ఇక హీరోయిన్ గా స్వాతి ఫస్ట్ మూవీ ‘డేంజర్’. కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీలో అల్లరి నరేష్ హీరోగా నటించారు. ఇక అప్పటినుంచి ఆడవారి మాటలకు అర్ధాలే వేరులే, అష్టా చమ్మా, స్వామి రారా, కార్తికేయ వంటి సూపర్ హిట్ తెలుగు సినిమాల్లో నటించి మెప్పించింది. మరోవైపు తమిళ ఇండస్ట్రీలో కూడా క్రేజీ ఆఫర్స్ అందుకుంది. ఇక ఆ తర్వాత ఆఫర్స్ తగ్గడంతో పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో ఫారిన్ లో సెటిల్ అయింది. రీసెంట్ గానే ఈ బ్యూటీ ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ‘మంత్ ఆఫ్ మధు’ అంటూ తన స్టైల్ మూవీతో మరోసారి తెలుగు ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అయింది.

ఈ నేపథ్యంలోనే ఆమె రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఇండస్ట్రీ పైన చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అల్లరి నరేష్ తో తన ఫస్ట్ మూవీ డేంజర్ చేస్తున్న టైంలో తనకు ఎదురైన చేదు అనుభవం గురించి చెప్పుకొచ్చింది. ఆ సినిమా షూటింగ్ టైంలో అల్లరి నరేష్ కంగారుగా తన దగ్గరకు వచ్చి నీకు సంబంధించి ఏదో ఎంఎంఎస్ వచ్చింది చూసావా ? అంటూ ఒక వీడియోను తనకు చూపించాడట. ఆ వీడియో చూడగానే నాకు మనుషుల మీద విరక్తి కలిగింది. చి చి ఇండస్ట్రీ అంటే ఇంత వరస్ట్ గా ఉంటుందా అని బాధపడ్డాను. అప్పటికప్పుడే సినిమాలు కూడా మానేద్దాం అనుకున్నాను కానీ స్నేహితులు ధైర్యం చెప్పడంతో, పెద్ద పెద్ద స్టార్స్ కే ఇలాంటి అవమానాలు తప్పలేదు అనుకుంటూ మళ్లీ సినిమాలు కొనసాగించాను అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ గా మారాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు