Aishwarya Rai: ఐశ్వర్యా రాయ్ పై పాక్ క్రికెటర్ నీచమైన కామెంట్స్

ఈ ఏడాది జరిగిన జరుగుతున్న అత్యంత ప్రతిష్టాత్మకమైన వరల్డ్ కప్ లో పాక్ జట్టు ఓటమిని వారి అభిమానులతో పాటు సీనియర్ మాజీ క్రికెటర్లు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఐసీసీ వన్డే వరల్డ్ కప్ ఫీవర్ నడుస్తోంది. భారత్ లోనే ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 జరుగుతుండగా, అందులో నుంచి పాకిస్తాన్ నిష్క్రమించిన విషయం క్రికెట్ ప్రియులకు తెలిసిన సంగతే. మెగా టోర్నీ లీగ్ స్టేజ్ లో నాలుగు అంటే కేవలం నాలుగు విజయాలనే సాధించి, ఆ తర్వాత పాక్ ఇంటిదారి పట్టింది. కనీసం సెమి ఫైనల్ కు కూడా చేరుకోకుండానే, ఒక్క భారత్ తోనే కాకుండా ఇంగ్లాండ్, ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా చేతిలో కూడా ఓడిపోయి వెనుదిరిగిన పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై ఆ దేశ క్రికెట్ ప్రియులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే మాజీ ఆల్ రౌండర్ అబ్దుల్ రజాక్ మన ప్రపంచ సుందరి ఐశ్వర్య రాయ్ పై నీచమైన కామెంట్స్ చేయడం తీవ్ర దుమారానికి తెరలేపింది.

తాజాగా పాక్ జట్టు ఓటమి గురించి మాట్లాడుతూ అబ్దుల్ రజాక్ పాకిస్తాన్ క్రికెట్ బోర్డు వైఖరిని తప్పు పట్టారు. అందులో భాగంగానే క్రికెట్ తో అసలు ఏ మాత్రం సంబంధం లేని బాలీవుడ్ బ్యూటీ మాజీ విశ్వసుందరి ఐశ్వర్యరాయ్ ని మధ్యలోకి లాగుతూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. తాజాగా జరిగిన ఓ మీడియా ఇంటరాక్షన్ సందర్భంగా పాక్ మాజీ క్రికెటర్లు ఉమర్ గిల్, షాహిదీ ఆఫ్రిది, అబ్దుల్ రజాక్ పాల్గొన్నారు. వీరి మధ్య ఇటీవల క్రికెట్లో పాక్ జట్టు ప్రదర్శన గురించి చర్చ జరగగా, ఆ సమయంలోనే అబ్దుల్ హద్దు మీరి ఐశ్వర్య పై కామెంట్స్ చేశారు. ఐశ్వర్యరాయ్ ను తాను పెళ్లి చేసుకుంటే అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారు అనుకోవడం పొరపడినట్లే అంటూ దిగజారుడు వ్యాఖ్యలు చేశాడు.

రజాక్ మాట్లాడుతూ “అప్పటి కెప్టెన్ యూనిస్ ఖాన్ బాగా ఆడతాడని నాకు నమ్మకం ఉండేది. టీం లోని ప్లేయర్స్ అందరం అదే అనుకున్నాం కూడా. కానీ ఇప్పుడు మాత్రం మంచి ఆటగాళ్లను తయారు చేయాలని, పాక్ క్రికెట్ టీంను మెరుగుపరచాలనే ఆలోచన కానీ, సంకల్పం కానీ పాకిస్తాన్ బోర్డుకు లేదు. మరి సంకల్ప బలమే లేనప్పుడు ఫలితాలు మాత్రం ఎలా వస్తాయి? నేను ఐశ్వర్యరాయ్ ను పెళ్లి చేసుకుంటే అందమైన, పవిత్రమైన పిల్లలు పుడతారని అనుకుంటే అలా ఎప్పటికీ జరగదు. ఇది కూడా అంతే. బోర్డు సంకల్పం బలంగా ఉంటేనే ఏదైనా సాధ్యమవుతుంది అంటూ కామెంట్స్ చేశాడు. రజాక్ వ్యాఖ్యలపై మాజీ కెప్టెన్ షాహిదీ కూడా చప్పట్లు కొట్టడం క్రికెట్ వరల్డ్ ను నివ్వరపోయేలా చేసింది.

- Advertisement -

ఇక దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ కావడంతో భారత క్రికెట్ అభిమానులు రజాక్ వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. నువ్వు మాట్లాడాలనుకుంటే నేరుగా క్రికెట్ గురించి మాట్లాడకుండా, ఇలా క్రికెట్ తో సంబంధం లేని ఐశ్వర్య ని మధ్యలోకి లాగి దిగజారుడు వ్యాఖ్యలు చేయడం ఏంటని విరుచుకుపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా రజాక్ తన టంగ్ స్లిప్ అయిందంటూ, తన ఉద్దేశం ఐశ్వర్యరాయ్ ని అవమానించడం కాదంటూ, ఆమెకు క్షమాపణలు చెబుతూ ఓ వీడియోను రిలీజ్ చేశారు.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు