Nandita Swetha: బోల్డ్ సీన్స్ పై నందిత స్పెషల్ ఇంట్రెస్ట్… ఆ హీరోయిన్ ఎఫెక్టేనా?

“ఎక్కడికి పోతావు చిన్నవాడా” అనే సినిమాతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన చిన్నది నందిత శ్వేత. ఫస్ట్ సినిమాతోనే నందిత తెలుగు ప్రేక్షకులను బాగా అలరించింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలేవీ ఆమెను టాలీవుడ్ ఆడియన్స్ కు గట్టిగా కనెక్ట్ అయ్యేలా చేయలేకపోయాయి. అయితే సినిమాలో పెద్దగా గ్లామర్ ఒలకబోయకుండా, పద్ధతి గానే కనిపించే ఈ అమ్మడు ప్రస్తుతం బోల్డ్ రోల్స్ పై ఆసక్తి కనబరుస్తోందట. అంతేకాదు శృంగార సన్నివేశాలు ఉన్న కథలైనా సరే, బోల్డ్ సీన్స్ ఉన్నా ఓకే అంటూ ఈ జనరేషన్ కు కనెక్ట్ అయ్యే స్టోరీస్ ఉంటే చెప్పాలని తన దగ్గరకు వచ్చే డైరెక్టర్స్ ను అడుగుతోందట.

నిజానికి ఇప్పటిదాకా నందిత తన దగ్గరకు వచ్చే స్టోరీలో శృంగార సన్నివేశాలు ఉంటే నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసేదట. కానీ ఇప్పుడు మాత్రం అలాంటి సీన్సే కావాలని స్పెషల్ గా అడుగుతూ ఉండడం ఆసక్తికరంగా మారింది. అంతేకాదు ఆమె ఇలా అడగడానికి స్పెషల్ రీజన్ మరో క్రేజీ హీరోయిన్ అంటూ చెవులు కొరుకుకుంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆ హీరోయిన్ మరెవరో కాదు పాయల్ రాజ్ పుత్. ప్రస్తుతం పాయల్ రాజ్ పుత్ కు టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉందని చెప్పాలి. దానికి ప్రత్యేక కారణం ఆమె ఫస్ట్ మూవీ “ఆర్ఎక్స్ 100”. ఆ సినిమాతో పాటు ఇప్పటిదాకా ఈ భామ గ్లామర్ ను వడ్డించడానికి హద్దులు ఏమి పెట్టుకోలేదు. పైగా మొదటి సినిమాలోనే అలాంటి సీన్స్ చేసి యూత్ ను తన వైపుకు తిప్పేసుకుంది. నిజానికి “ఆర్ఎక్స్ 100” సినిమాలో ముందుగా నందిత శ్వేతను హీరోయిన్ గా తీసుకోవాలని అనుకున్నారట డైరెక్టర్ అజయ్ భూపతి.

అయితే అందులో బెడ్ రూమ్ సీన్స్ ఎక్కువగా ఉన్నాయి అని రిజెక్ట్ చేసానని ఒకానొక సందర్భంలో నందిత స్వయంగా చెప్పుకొచ్చింది. కానీ అజయ్ భూపతి మాత్రం తాను కొత్త దర్శకుడుని కాబట్టి సరిగ్గా డీల్ చేయగలడో లేడో అనే ఉద్దేశంతోనే ఆమె ఈ సినిమాను రిజెక్ట్ చేసిందని కుండబద్దలు కొట్టాడు. ఏదైతేనేం మొత్తానికి ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీని వదులుకొని, ఆ తర్వాత అందులో నటించిన పాయల్ కు వచ్చిన క్రేజ్ చూసి నందిత తప్పకుండా బాధపడే ఉంటుంది. అందుకే ఇప్పుడు అలాంటి సీన్స్ సైతం చేయడానికి వెనకాడట్లేదు. అందులో భాగంగానే రీసెంట్ గా నందిత హీరోయిన్ గా నటించిన ‘హిడింబ’లో కాస్త హద్దులు దాటి నటించేసింది. అంతేకాదు ప్రస్తుతం అలాంటి సీన్స్ ఉన్న కథల కోసం వెతుకుతోందట. కాగా అజయ్ భూపతి కొత్త చిత్రం ‘మంగళవారం’ సినిమాలో నందిత ఓ కీలక పాత్ర పోషిస్తుంది. ఈ మూవీలోనే పాయల్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండడం విశేషం.
Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు