Nandita Swetha: బెడ్ రూం సీన్స్ వల్లే ఆ క్రేజీ మూవీ వదులుకున్న నందిత శ్వేత

“ఎక్కడికి పోతావు చిన్నవాడా” సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైన హీరోయిన్ నందిత శ్వేత. ఆ తర్వాత ఈ బ్యూటీ పలు సినిమాలు చేసినప్పటికీ స్టార్ హీరోయిన్ స్టేటస్ మాత్రం అందుకోలేకపోయింది. ఇప్పటికీ అడపదడపా సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. అయితే సాధారణంగా హీరోయిన్లకు పలు అవకాశాలు వస్తూ ఉంటాయి. అయితే వారు తీసుకునే నిర్ణయాలే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కొంతమంది బోల్డు పాత్రలకు సై అంటే, మరి కొంతమంది మాత్రం వాటిని చూసి భయపడుతూ ఉంటారు. సాంప్రదాయ పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర అవ్వాలని చూస్తారు. ఇక బోల్డ్ రోల్స్ కు ఇంపార్టెన్స్ ఇచ్చే హీరోయిన్స్ క్రేజీ ఆఫర్స్ అందుకోవడం తోపాటు వీలైనంత త్వరగా యూత్ గుండెల్లో చోటు సంపాదించుకుంటారు. దీంతో వారికి స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకోవడానికి పెద్దగా టైం పట్టదు అని చెప్పాలి. ఇక సినిమాల్లో కూడా పద్ధతిగా కనిపించాలి అనుకునే హీరోయిన్లు కొన్ని క్రేజీ ఆఫర్స్ ను వదులుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే నందిత శ్వేత కూడా అలాంటి ఓ క్రేజీ ఆఫర్ ను వదులుకొని ఆ తర్వాత బాధపడాల్సి వచ్చింది.

2018 లో రిలీజ్ అయిన “ఆర్ఎక్స్ 100” మూవీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ మూవీ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందంటే పాయల్ కు ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్ క్రేజ్ దక్కింది. మొదటి సినిమాతోనే డైరెక్టర్ అజయ్ భూపతి స్టార్ హీరోల దృష్టిని ఆకర్షిస్తే, హీరో హీరోయిన్ కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ లకు నటులుగా మంచి గుర్తింపు లభించింది. ఇక ఈ సినిమాలో పాయల్ చేసిన పాత్రను ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. అయితే ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటించే ఛాన్స్ నందిత శ్వేతకు వచ్చిందట. ఓ సందర్భంలో ఆమె స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. హీరోగా నవీన్ చంద్రను తీసుకోవాలనుకున్నారట. మరి హీరోయిన్ గా తన దగ్గరకు వచ్చిన అలాంటి అద్భుతమైన అవకాశాన్ని నందిత శ్వేత ఎలా చేజార్చుకుందంటే…

సినిమాలో బోల్డ్ సీన్స్ ఉండడమే అందుకు కారణమట. లిప్ లాక్ సీన్స్, బెడ్ రూమ్ సీన్స్ ఉండడంతో నందిత ఈ సినిమాను పక్కన పెట్టేసిందట. ఇక ప్రస్తుతం అజయ్ భూపతి ‘మంగళవారం’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమాలో కూడా పాయల్ హీరోయిన్ గా నటిస్తుండగా, ట్రైలర్లో చూస్తే సినిమాలో యూత్ కు కావలసిన మసాలా గట్టిగానే ఉన్నట్టుగా అర్థమవుతుంది. ఈ సందర్భంగా అప్పట్లో నందిత ‘ఆర్ఎక్స్ 100’ లాంటి క్రేజీ మూవీని వదులుకొని తప్పు చేసిందని, ఒకవేళ ఆ సినిమాలో నందిత నటించి ఉంటే ఇప్పుడు తనకు మంచి కెరీర్ ఉండేదని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు