Nayanthara: నయన్ ఓవర్ అవుతోందా? అంత డిమాండ్ అవసరమా?

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్స్ లిస్ట్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయిపోయారు. ప్రస్తుతం ఈ బ్యూటీ పాపులారిటీ నార్త్ కు కూడా పాకింది. ముఖ్యంగా ‘జవాన్’తో మన సౌత్ స్టార్ హీరోయిన్ గా ఉన్న నయన్ కు నార్త్ ప్రేక్షకులు కూడా దాసోహమయ్యారు. షారుఖ్ తో ఆమె ఆన్ స్క్రీన్ రొమాన్స్ చూసి ఫిదా అయిపోయారు. ఇక నయన్ గురించి ఈ మాత్రం చెబితే సరిపోదు. ఆమె రెమ్యూనరేషన్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ప్రస్తుతం టాప్ హీరోయిన్లకే అసూయ కలిగేలా తన డిమాండ్ కు తగ్గ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటోంది నయన్. ఇప్పటికే సౌత్ లోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే స్టార్ హీరోయిన్ గా రికార్డులు క్రియేట్ చేసిన మన నయన్ ఇప్పుడు బాలీవుడ్ హీరోయిన్లను కూడా తీసి పారేసే రేంజ్ లో దూసుకెళ్తోంది. నయన్ ఓ క్రేజీ కాంబోలో వస్తున్న మూవీకి షాకింగ్ రెమ్యూనరేషన్ అడిగింది అనే న్యూస్ సౌత్ లో హాట్ టాపిక్ గా మారింది.

లోకనాయకుడు కమల్ హాసన్, దిగ్గజ డైరెక్టర్ డైరెక్టర్ మణిరత్నం కాంబోలో రూపొందుతున్న క్రేజీ మూవీ “థగ్”. ఏకంగా 36 ఏళ్ల తరువాత ఈ దిగ్గజ ద్వయం కాంబోలో మూవీ రాబోతుండడంతో, ప్రాజెక్ట్ ను ప్రకటించగానే అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ గా త్రిషను తీసుకున్నారు మేకర్స్. కానీ అంతకంటే ముందు కమల్ తో రొమాన్స్ చేసే ఛాన్స్ నయన్ వద్దకు వెళ్లిందట. అయితే నయన్ డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ నిర్మాతలకు చెమటలు పట్టించిందట. ‘జవాన్’కు 10 కోట్లు పారితోషికంగా అందుకున్న ఏ అమ్మడు ‘థగ్’ కోసం ఏకంగా 12 కోట్లు అడిగిందట. పైగా నయన్ రెమ్యూనరేషన్ విషయంలో ఖచ్చితంగా ఉంటుందట. దీంతో ‘థగ్’ మేకర్స్ సైలెంట్ గా సైడ్ కు వచ్చేసి, త్రిషను తీసుకున్నారట.

ఇక ఈ విషయం తెలిసిన సినీ జనాలు ‘జవాన్’ తరువాత నయన్ కు డిమాండ్ బాగా పెరిగిందని అంటున్నారట. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా ప్రొడ్యూసర్స్ కు మాత్రమే అందుబాటులో ఉండే హీరోయిన్ గా మారింది, అయితే బాలీవుడ్ లో దశాబ్ద కాలం నుంచి స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న దీపికా పదుకొనె కూడా ఇంత భారీగా డిమాండ్ చేయట్లేదని అంటున్నారు. దీపికా ప్రస్తుతం 10 కోట్లు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్టు సమాచారం. దీంతో నయన్ పారితోషికం విషయంలో మరీ ఓవర్ అవుతోందా ? అని ఆమె అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు