Payal Rajput: మంగళవారం” సినిమాను మిస్ చేసుకున్న బ్యూటీ ఎవరో తెలుసా..? ఆ చిన్న రీజన్ తో..!

పాయల్ రాజ్ పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కిన సస్పెన్స్ థ్రిల్లర్ మంగళవారం. ఈ సినిమా నవంబర్ 17న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్ లు భారీ హైప్ ను తెచ్చిపెట్టాయి. దాంతో సినిమా ఎలా ఉండబోతుంది…ఎలాంటి విజయాన్ని అందుకుంటుంది అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే తాజాగా ఈ సినిమా గురించి డైరెక్టర్ అజయ్ భూపతి ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఒక సినిమా అనుకున్నప్పుడు ముందుగా చాలా మందిని ఆ పాత్రల్లో ఊహించుకుంటారు.

సంప్రదించడం…ఆడిషన్స్ చేయడం కూడా జరుగుతుంది. మంగళవారం సినిమా విషయంలో కూడా అదే జరిగింది. మహాసముద్రం సినిమా షూటింగ్ సమయంలోనే మంగళవారం సినిమాను అనుకున్నట్టు అజయ్ భూపతి వెల్లడించారు. కమర్షియల్ సినిమాలు ఒక మీటర్ మీద వెళతాయి కాబట్టి చేయడం కష్టం కాదని అన్నారు. కానీ మంగళవారం లాంటి సినిమా చేయడం చాలా కష్టమని అజయ్ అభిప్రాయపడ్డారు. డైరెక్షన్ అండ్ టెక్నికల్ వాల్యూస్ నటన ఇలా చాలా ఉంటాయని చెప్పారు. వారితో పాటు సాంకేతిక నిపుణులను కూడా ఒక తాటిపైకి తీసుకురావాలని చెప్పారు.

అంతే కాకుండా మహాసముద్రం సినిమా సమయంలోనే హీరోయిన్ అదితీ రావు హైదరికి మంగళవారం కథ చెప్పానని అన్నారు. దానికి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని కానీ ఆ తరవాత తాను అదితీ రావును సంప్రదించలేదని చెప్పారు. మంగళవారం అంటే మంచిది కాదు అనే అభిప్రాయం ఉందని కానీ మంగళవారం అంటే శుభప్రదమైన రోజు అని చెప్పారు. గతంలో మనకు అదే రోజు సెలవు ఉండేది అని కానీ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తరవాత ఆ సెలవును ఆదివారానికి మార్చినట్టు తెలిపారు.

- Advertisement -

ఇదిలా ఉండగా మంగళవారం సినిమాను అజయ్ భూపతి ఎం. సురేష్ వర్మ, స్వాతి రెడ్డితో కలిసి నిర్మించారు. సినిమాలో పాయల్ తో పాటు అజ్మల్ అమీర్ ముఖ్యమైన పాత్రలో నటించారు. కాగా అజయ్ భూపతి చివరి సినిమా మహాసముద్రం బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టింది. మరి మంగళవారం అయినా అజయ్ భూపతి మంచి రోజును తెచ్చిపెడుతుందా లేదా చూడాలి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు