Mangalavaram: పాయల్‌ని నమ్ముకుని అంత బడ్జెట్ పెట్టారా?

పాయల్ రాజ్‌పుత్… చాలా ఏళ్ల క్రితం వచ్చిన RX100 సినిమాలో ఈమె నటించింది. అది సూపర్ హిట్ అయింది. దీని తర్వాత పాయల్ ఎన్నో సినిమాలు చేసింది. కానీ, ఒకటి అంటే ఒక్క మూవీ కూడా హిట్‌కు నోచుకోలేదు. ఇప్పుడు పాయల్ రాజ్‌పుత్ తనకు RX100 హిట్ ఇచ్చిన అజయ్ భూపతితోనే మరో సినిమా చేస్తుంది. మంగళవారం అనే డిఫరెంట్ టైటిల్ తో వస్తున్న ఈ మూవీ ఈ నెల 17న విడుదల కాబోతుంది.

డార్క్ థ్రిల్లర్ జానర్ లో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి. అయితే రీసెంట్ గా ఈ సినిమా బడ్జెట్ కి సంబంధించి డైరెక్టర్ అజయ్ భూపతి చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. ఈ సినిమాలో చెప్పుకొదగ్గ స్టార్ క్యాస్టింగ్ అంటే పాయల్ మాత్రమే. అలాంటి చిన్న సినిమాకు 20 కోట్ల వరకు బడ్జెట్ అయిందని డైరెక్టర్ అజయ్ భూపతి చెప్పుకొచ్చాడు. 20 కోట్లతో ఓ సినమా వస్తుంది అంటే… దాన్ని చిన్న సినిమా అని చెప్పలేం.

కానీ, సినిమాలో స్టార్స్ ఎవరూ లేరు. కేవలం అజయ్ భూపతి తన స్టోరీపైనే నమ్మకం పెట్టుకున్నాడని చెప్పుకొవచ్చు. అలాగే. తనకు డార్క్ థ్రిల్లర్ జానర్ లో సినిమా చేయాలని చాలా రోజుల నుంచి ఉందని, అది ఇప్పుడు సాధ్యమవుతుందని చెప్పుకొచ్చాడు. నిజానికి మంగళవారం సినిమాను మహా సముద్రం హిట్ అయిన తర్వాతే చేయాలని అనుకున్నాడట. కానీ, అప్పటి పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదని చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ఇదిలా ఉండగా, ఇప్పుడు టాపిక్ మొత్తం… ఎలాంటి స్టార్ క్యాస్టింగ్ లేని మంగళవారం సినిమాకు 20 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయా? అని. అజయ్ భూపతి మాత్రం సినిమాపై, తన స్టోరీపై ఫుల్ కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. తనకు మరో RX100 లాంటి హిట్ వస్తుందని ధీమాగా ఉన్నాడు. మరీ అది నిజం అవుతుందా? పాయల్‌కు, అజయ్ భూపతికి హిట్ వస్తుందా? 20 కోట్లకు పైగా కలెక్షన్లు వస్తాయా? అనేది తెలియాలంటే.. ఈ శుక్రవారం వరకు వెయిట్ చేయాల్సిందే.

Grab Filmify for the latest web stories on Celebrities, today’s Tollywood news, the latest images of actors & actresses, new movie ratings & reviews, and the latest entertainment news from all Film Industries.

 

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు