టాలీవుడ్ ఇండస్ట్రీలో కోట్లాదిమంది అభిమానులను సొంతం చేసుకున్న హీరోలలో మెగా హీరో రామ్ చరణ్ ఒకరు. రామ్ చరణ్ తో సినిమా అంటే 100 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి అయినా నిర్మాతలు సిద్ధమే. రామ్ చరణ్ ఓకే అనాలి కాని చాలామంది దర్శకులు క్యూ కడతారు. అలాంటి రామ్ చరణ్ ని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని మెగాస్టార్ చిరంజీవి అనుకున్న సమయంలో ఎంతోమంది ఎన్నో రకాలుగా అవమానించారట. అవును ఇప్పుడు ఇదే విషయం ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
మెగాస్టార్ చిరంజీవి తన కొడుకు రామ్ చరణ్ ని చిరుత సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా కంటే ముందే చిరంజీవి తన కొడుకును ఓ స్టార్ డైరెక్టర్ దర్శకత్వంలో ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నారట. కానీ ఆదర్శకుడు మాత్రం ఇప్పుడు కాదు.. తర్వాత చూద్దాం అంటూ చిరంజీవి ముందు ఒకరకంగా మాట్లాడుతూ.. ఆయన వెనుక మరో రకంగా మాట్లాడసాగారట. ఆ దర్శకుడి మాటలు నమ్మిన చిరంజీవి అతని దర్శకత్వంలోనే ఇంట్రడ్యూస్ చేద్దామని ఫిక్స్ అయిపోయారట.
కానీ ఆ దర్శకుడు మాత్రం పక్క వాళ్ళతో వాడిది అసలు హీరో ఫేసేనా..? వాడి ముఖంలో ఒక్కటైనా హీరో క్వాలిటీ ఉందా..? చిరంజీవి కొడుకు అయినంత మాత్రాన మరో చిరంజీవిగా మారిపోతాడా..? అంటూ చీప్ గా మాట్లాడారట. అలా ఆయన చేసిన వ్యాఖ్యలు చివరికి చిరంజీవికి కూడా చేరాయట. దీంతో ఎంతగానో బాధపడిన చిరంజీవి తన కొడుకు లుక్స్ మార్చి డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో చిరుత సినిమా ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు. ఇక ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా చరణ్ ఎంత హై రేంజ్ లో ఉన్నాడో మనకు తెలిసిందే.