Sharwanand: శర్వానంద్ మూవీకి కష్టాలు… హోల్డ్ లో పెట్టేశారా?

యంగ్ హీరో శర్వానంద్ కొత్త మూవీకి కష్టాలు స్టార్ట్ అయ్యాయి. ప్రస్తుతం ఈ మూవీని హోల్డ్ లో పెట్టారనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. “భలే మంచి రోజు” ఫేమ్ డైరెక్టర్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో శర్వానంద్ తన నెక్స్ట్ మూవీకి కమిట్ అయిన విషయం తెలిసిందే. శర్వానంద్ కెరీర్ లో 35వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి “మనమే” అనే టైటిల్ ను ఖరారు చేశారు. గతంలో “ఒకే ఒక జీవితం” అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన శర్వా, ఆ మూవీ ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో ఈసారి కమర్షియల్ మూవీతో తన అదృష్టం పరీక్షించుకోవడానికి రెడీ అవుతున్నాడు.

మరోవైపు ‘ఉప్పెన’ సినిమాతో టాలీవుడ్ లోకి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చిన యంగ్ అండ్ బ్యూటిఫుల్ హీరోయిన్ కృతి శెట్టి ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. అయితే దురదృష్టవశాత్తు ఆమె ఇటీవల కాలంలో చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ గా మారడంతో ఈ సినిమా పైనే కృతి ఆశలన్నీ పెట్టుకుంది. వీరిద్దరి కాంబోలో ఇప్పుడు ‘మనమే’ అనే రొమాంటిక్ ఎంటర్టైనర్ రాబోతోంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉండగా, ఈ నేపథ్యంలోనే ‘మనమే’ మూవీకి బడ్జెట్ కష్టాలు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తోంది. దానికి ఓ ప్రత్యేకమైన కారణం ఉందట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన చాలా బాగా లండన్ లో చిత్రీకరించగా, ఇంకా కొంత షూటింగ్ పెండింగ్ లోనే ఉందట. మూవీ షూటింగ్ పూర్తిగా కంప్లీట్ కాక ముందే ‘మనమే’ బడ్జెట్ అనుకున్న దానికంటే చేయి దాటి పోవడంతో సినిమా షూటింగ్ ను ప్రస్తుతం హోల్డ్ లో పెట్టారట. ప్రస్తుతం బడ్జెట్ గురించి చర్చలు జరుగుతున్నాయట. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానుంది అని అంటున్నారు.

- Advertisement -

మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో మేకర్స్ స్వయంగా క్లారిటీ ఇస్తేగానీ క్లారిటీ రాదు. ఈ మూవీ వచ్చే రిలీజ్ కానుంది. ఇదిలా ఉంటే శర్వానంద్ మరో రెండు సినిమాలను లైన్లో పెట్టినట్టు సమాచారం. సామజవరగమన ఫేమ్ రామ్ అబ్బరాజు ప్రాజెక్ట్ చర్చల దశలో ఉంది. ఇక వచ్చే ఏడాది యూవీ క్రియేషన్స్ లో మరో మూవీ చేయనున్నాడు. శర్వా సాలిడ్ హిట్ కొట్టక చాలా కాలమే అయ్యింది. కాగా ఆయన తండ్రి కాబోతున్నారన్న గుడ్ న్యూస్ ఇటీవలే బయటకు వచ్చింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు