Aishwarya Rai: విడాకులకు సిద్ధమైన మాజీ విశ్వ సుందరి

ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ లలో క్యూట్ పెయిర్ లిస్ట్ లో మొదటి వరుసలో ఉండే జంట ఐశ్వర్యరాయ్-అభిషేక్ బచ్చన్. దశబ్ధాలుగా బాలీవుడ్ ను ఏలిన ఐశ్వర్య రాయ్ కి ఇప్పుడు కూడా ఎనలేని క్రేజ్ ఉంది. ఐదు పదుల వయసు వచ్చినా, ఏ మాత్రం వన్నె తగ్గని అందం ఈ మాజీ విశ్వసుందరి సొంతం. అభిషేక్ బచ్చన్ తో 2007లో ఐశ్వర్య పెళ్లి జరిగింది. అప్పటి నుంచి బెస్ట్ కపుల్ అనిపించుకుంటూ తమ వైవాహిక జీవితాన్ని సక్సెస్ ఫుల్ గా రన్ చేశారు. వీరికి ఆరాధ్య అనే ఒక కూతురు కూడా ఉంది.

అయితే గత కొద్ది రోజుల నుంచి ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల వైవాహిక జీవితం గురించి బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. వీరి మధ్య విభేదాలు వస్తున్నాయని, త్వరలోనే వీరు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ వార్తలు పుట్టుకొస్తున్నాయి. దీనిపై బచ్చన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటి వరకు కూడా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వార్తలకు బ్రేక్ పడలేదు. తాజాగా NMACC లో జరిగిన ఓ ఘటనతో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్ ల విడాకుల విషయం మరోసారి చర్చకు వచ్చింది.

నీతా అంబానీ, ముఖేష్ అంబానీ ఇటీవల ఒక కల్చరల్ ఈవెంట్ ను నిర్వహించారు. దీనికి బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రెటీలు హాజరయ్యారు. ఈ ఈవెంట్ కు ఐశ్యర్య రాయ్ కూడా వెళ్లింది. అయితే ఇక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఈవెంట్ లో ఐశ్యర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో మాత్రమే వచ్చింది. పక్కన అభిషేక్ బచ్చన్ లేడు. ఇప్పటికే విడాకుల వార్తలు తెగ వస్తున్న నేపథ్యంలో NMACCకి వీరు ఇద్దరు కలిసి రాకపోవడంపై అనేక అనుమానాలు వస్తున్నాయి.

- Advertisement -

అయితేే, అభిషేక్ ఇతర పనుల్లో బిజీగా ఉండటం వల్లే ఈవెెంట్ కు రాలేడని కొంత మంది అంటున్నారు. అయితే విడాకుల వార్తలపై ఇప్పటి వరకు ఎందుకు స్పందించలేేదు అంటూ మరి కొంత మంది నుంచి ప్రశ్నలు వస్తున్నాయి. నిజాంగానే వీళ్లు విడాకులు తీసుకుంటున్నారా? ఐశ్వర్య, అభిషేక్ మధ్య మనస్ఫర్థలు ఉన్నాయా ? అనేది తెలియాలంటే వీరి నుంచి స్పందన రావాల్సిందే.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు