Bollywood: కరణ్ కష్టాలు.. ఆ స్టార్‌ని మర్డర్ చేయబోయాడా ?

బాలీవుడ్.. ఒకప్పుడు సినీ ప్రపంచంలో ఓ వెలుగు వెలుగిన ఇండస్ట్రీ. భారతీయ సినిమా ముఖచిత్రంలా ఉండేది బాలీవుడ్. అంతర్జాతీయ వేదికలపై కూడా బాలీవుడ్ అంటే భారతీయ సినిమా. భారతీయ సినిమా అంటే కేవలం బాలీవుడ్ అనే ధోరణితో ఉండేది. కానీ, ప్రస్తుతం పరిస్థితిలు మారిపోయాయి. బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాలు ప్రేక్షకులను అలరించలేకపోతున్నాయి. అలాగే బీ టౌన్ లో జరిగే సినీ పాలిటిక్స్ తో ఉన్న పరువు కూడా గంగలో కలుస్తుంది. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహర్ పై ఈ మధ్య కాలంలో వస్తున్న ఆరోపణలు అన్నీ ఇన్ని కాదు.

ఇటీవల ప్రియాంక చోప్రా తాను బాలీవుడ్ ను వదిలేయడానికి ఓ కారణం ఉందని, తనను బాలీవుడ్ వదిలిపెట్టేలా కొంత మంది కంకణం కట్టుకుని మరీ ప్రయత్నించారని సంచలన కామెంట్స్ చేసింది. దీనిపై కంగన రౌనత్ స్పందిస్తూ.. బాలీవుడ్ నుంచి ప్రియాంకను దూరం చేయాలని నిర్మాత కరణ్ జోహర్ ప్రయత్నించాడని చెప్పి బాంబ్ పేల్చింది. ఆ వేడి బీ టౌన్ లో ఇంక తగ్గనే లేదు.. ఇప్పుడు కరణ్ జోహర్ మెడకు మరో కష్టం వచ్చింది.

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అనుష్క కెరీర్ ను కరణ్ మర్డర్ చేయాలని చూశాడట. అనుష్క కెరీర్ ప్రారంభంలో ఆమెను తోక్కేయాలని అనుకున్నాడట ఈ విషయాన్ని స్వయంగా కరణ్ జోహర్ చెప్పాడు. 2016లో జరిగిన 18వ ‘మామి -ముంబై ఫిల్మ్ ఫెస్టివల్’ లో కరణ్ ఈ విషయాన్ని చెప్పాడు. అయితే ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది బాలీవుడ్ లో ప్రస్తుతం చర్చనీయాశంగా మారింది.

- Advertisement -

అనుష్క తన మొదటి సినిమా షారుక్ ఖాన్ తో చేసిన విషయం తెలిసిందే. “రబ్ నే బనాది జోడి” అనే సినిమాలో అనుష్క తానీ అనే పాత్ర చేసింది. ముందుగా ఈ పాత్ర కోసం సోనమ్ కపూర్ అనుకున్నారట. కానీ, అనుష్క ఆడీషన్స్ డైరెక్టర్ ఆదిత్య చోప్రాకు నచ్చిందట. అప్పుడు కరణ్.. ”అనుష్క శర్మ కెరీర్ ను నేను పూర్తిగా మర్డర్ చేయాలనుకున్నాను. ఎందుకంటే ఆదిత్య చోప్రా నాకు ఆమె ఫోటోని చూపించినప్పుడు. అనుష్క శర్మతో డీల్ వద్దు అని చెప్పాను. మరో యువనటి ఉంది. ఆమెతో సినిమా చేస్తానని చెప్పాను. కానీ, చివరికి ఈ మూవీలో అనుష్కనే నటించింది.

ఈ విషయం పాతదే అయినా, వీడియో వైరల్ అవ్వడంతో బాలీవుడ్ లో ఉన్న సినీ పాలిటిక్స్ గురించి మరోసారి చర్చకు వస్తుంది. ప్రియాంక, కంగన చేసిన వ్యాఖ్యల తర్వాత ఈ వీడియో వైరల్ కావడంతో, కరణ్ పై మరింత వ్యతిరేకత వస్తుంది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు