Samantha :శాకుంతలం కొత్త పుంతలు

శాకుంతలం మూవీ ప్రమోషన్స్ ఊపు అందుకున్నాయి. భారీ బడ్జెట్, స్టార్ట్ కాస్టింగ్, అద్భుతమైన గ్రాఫిక్స్ తో రూపుదిద్దుకున్న “శాకుంతలం” సినిమా, షూటింగ్ & VFX వర్క్స్ అన్ని కంప్లీట్ చేసుకొని, ఈ నెల 14న విడుదలకి సిద్దమయింది. అయితే అప్పుడెప్పుడో రిలీజ్ అవ్వాల్సిన ఈ మూవీ సమంత అనారోగ్యం కారణం, 3డీ వర్స్ కూడా ఉండటంతో కూడా సినిమా వాయిదా పడుతూ వచ్చింది. అయితే ఇప్పుడు సమంత హెల్త్ కండిషన్ నార్మల్ అవడం తో ప్రమోషన్స్ లో బిజీ అయింది సమంత . శాకుంతలం సినిమాని తన భుజల మీద వేసుకొని తీరిక లేకుండాప్రమోషన్స్ చేస్తూనే ఉంది.

హైదరాబాద్, ముంబయి లాంటి నగరాల్లోనే కాదు.. గ్రామీణ ప్రాంతాల్లో కూడా సినిమాని ప్రోమోట్ చేయడానికి సమంత & టీం ప్లాన్ అఫ్ యాక్షన్ ని రెడీ చేసారంట. ఇప్పటికే తాను చేస్తున్న అన్ని సినిమాల డేట్స్ క్యాన్సిల్ చేసుకొని, ఏప్రిల్ 14 వరికి శాకుంతలం ప్రొమోషన్స్ లోనే ఉండబోతుంది సమంత. గుణ శేఖర్ డ్రీం ప్రాజెక్ట్ గా, అత్యంత భారీ స్కేల్ లో ఈ చిత్ర నిర్మాణం జరిగింది. విమెన్ ఓరియెంటెడ్ సినిమాకు ఇంత భారీ ఎత్తులో బడ్జెట్ పెట్టడం ఇదే మొదటి సారి. అందుకే సమంత ఈ సినిమాని సీరియస్ గా తీసుకుంది. తనని నమ్మిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా నష్టపోకుండా ఉండేదుకు, సమంత సినిమాకు సంబంధించి గ్రౌండ్ లెవెల్ ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది

దిల్ రాజు సమర్పణలో, సమంత టైటిల్ రోల్ పోషిస్తున్నఈ సినిమా కాళిదాస్ రచించిన “అభిజ్ఞాన శాకుంతలం” ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. భార్య భర్తల బంధానికి ప్రతీకగా చెప్పుకునే ఈ నాటకం ప్రతి ఒక్కరు చూడాలని ఆమె వెళ్లిన ప్రతి చోట చెప్తూ చిత్రాన్ని ప్రోమోట్ చేస్తుంది. సినిమా చేశామా, వదిలేశామా అని హీరోలు, హీరోయిన్ చేతులు దులిపేసుకుంటున్న ఈ రోజుల్లో నమ్మిన వాళ్ళ కోసం అండగా నిలుస్తోంది సమంత

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు