Nagababu: నిహారిక పెళ్లికి ఎంత కట్నం తెలుసా..?

మెగా డాటర్ నిహారిక గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ముఖ్యంగా మెగా డాటర్ అంటూనే తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. యాంకర్ గా తన కెరీర్ ని మొదలుపెట్టిన నిహారిక.. ఆ తర్వాత హీరోయిన్ గా అవకాశాలు అందుకుంది. కానీ ఒక్క సినిమా కూడా విజయం సాధించలేదు. ఆ తర్వాత ఇంట్లో పెద్దలు చెప్పిన వివాహం చేసుకుంది.

2020 డిసెంబర్ 9న రాత్రి 7:15 గంటలకు రాజస్థాన్ లోని ఉదయపూర్ ప్యాలెస్ లో నిహారిక పెళ్లి జరిగింది. కరోనా సమయం అయినందువల్ల అతి కొద్ది మంది స్నేహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. అయితే పెళ్ళై మూడేళ్లు కూడా గడవకముందే వీరి వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయంటూ కొద్ది రోజులుగా వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే.

నిహారిక – చైతన్య విడాకులు తీసుకోబోతున్నారంటూ వార్తలు వెలువడ్డ నేపథ్యంలో అసలు నాగబాబు కూతురు నిహారిక పెళ్లికి ఇచ్చిన కట్నం గురించి మరో వార్త వైరల్ గా మారింది. నిహారిక పెళ్లికి నాగబాబు దాదాపు రూ. 10 కోట్ల వరకు ఇచ్చినట్లు సమాచారం. అలాగే పెళ్లికి నగలు, మరో రెండు కోట్ల వరకు ఖర్చు చేశారని, నిహారిక పేరు మీద అల్లుడికి ఓ బంగ్లా కూడా ఇచ్చారంట. ఇక చిరంజీవి నిహారికకి ఓ వజ్రాలహరాన్ని బహుమతిగా ఇచ్చారట. దాని విలువ రూ. 2 కోట్లు ఉంటుందట. అలాగే అన్న వరుణ్ తేజ్ కూడా చెల్లి కోసం రెండు కోట్ల విలువ చేసే ఫ్లాట్ గిఫ్టుగా ఇచ్చాడట. ఇక బాబాయ్ పవన్ కళ్యాణ్ కూడా ఓ ఖరీదైన కారును అందించారట.

- Advertisement -

For More Updates : 

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు