Jr NTR: బాలీవుడ్ డెబ్యూ మూవీకి షాకింగ్ రెమ్యునరేషన్ ?

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ YRF స్పై యూనివర్స్ ను క్రియేట్ చేస్తున్న సంగతి విధితమే. ఇప్పటికే ఈ యూనివర్స్ లో చాలా సినిమాలు వచ్చాయి. ఇటీవల ఈ యూనివర్స్ నుంచి వచ్చిన పఠాన్ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అంతే కాకుండా 1,000 కోట్ల మార్క్ ను కూడా అందుకుంది. దీంతో YRF స్పై యూనివర్స్ నుంచి రాబోయే సినిమాలపై విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఇటీవల YRF స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 అనే చిత్రం వస్తుంది అని, దానిలో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ బాద్ షా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా నటించబోతున్నాడని తెగ వార్తలు వచ్చాయి.

వార్ 2లో ఎన్టీఆర్ పాత్ర ఫిక్స్ అని, అధికారిక ప్రకటన రాలేకపోయినా ఇదే నిజమని టాలీవుడ్, బాలీవుడ్ మీడియాలు తెగ ప్రచారం చేశాయి. ఈ చిత్రాన్ని పఠాన్ కు దర్శకత్వం వహించిన సిద్ధార్థ్ ఆనంద్ తెరకెక్కిస్తాడని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు ఎన్టీఆర్ భారీగా పారితోషికం తీసుకుంటున్నాడని సమాచారం అందుతుంది. వార్ 2 కు జూనియర్ ఎన్టీఆర్ రెమ్యునరేషన్ దాదాపు 100 కోట్ల వరకు తీసుకుంటున్నాడని బాలీవుడ్ వార్గల్లో టాక్ నడుస్తుంది.

ఆర్ఆర్ఆర్ చిత్రం తర్వాత జూనియర్ ఎన్టీఆర్ క్రేజ్ ప్రపంచ వ్యాప్తంగా విస్తరించింది. ఈయన నుంచి సినిమాలు వస్తే, మన దేశంతో పాటు ఓవర్సీస్ లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో తారక్ కు ఇంత మొత్తంలో రెమ్యునరేషన్ ఇచ్చినా, తప్పులేదని నిర్మాత యష్ చోప్రా భావించినట్టు ఉన్నాడు. అందుకే ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో తారక్ 100 కోట్లు ఇచ్చి మరీ భాగం చేసుకున్నాడని విశ్లేషకులు అభిప్రాయపడతున్నారు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు