Tollywood: రీ-రిలీజ్‌ల రచ్చ- ఫ్యాన్స్‌కి ఏమైనా పిచ్చ ?

టాలీవుడ్ లో ప్రస్తుతం రీ-రిలీజ్‌ల ట్రెండ్ నడుస్తుంది. గతంలో సూపర్ హిట్ అయినా స్టార్ట్ హీరోల సినిమాలని 4K మాస్టరింగ్ చేసి రీ-రిలీజ్ చేయడం ఈ మధ్య ట్రెండ్ గా మారింది. మొన్న మహేష్ బర్త్ డేకి ఒక్కడు, పోకిరి తరువాత వచ్చిన పవన్ బర్త్ డే కి ఖుషి, జల్సా, రవితేజ మిరపకాయ్, రామ్ చరణ్ ఆరెంజ్ సినిమాలను ఇలాగే రీ-రిలీజ్ చేసారు. ఆల్రెడీ రిలీజ్ అయినా సినిమాకి ఎవరు వెళ్తారు అనుకున్నవాళ్ళు నోరు వెళ్ళబెట్టేలా కలెక్షన్స్ వస్తున్నాయి.

తమ హీరోల వింటేజ్ లుక్స్ అండ్ ఆటిట్యూడ్ ని మళ్ళీ ఎక్సపీరియన్స్ చేస్తున్న ఫ్యాన్స్ థియేటర్ లలో గోల గోల చేస్తున్నారు. థియేటర్లలో తమ హీరో చెప్పే డైలాగ్ లకి డబ్బింగ్ చెప్పడాలు, పాటలకి డాన్స్ వేయడాలు, విలన్ లకి కౌంటర్ లు వేయటం అబ్బో థియేటర్ల.. లేక పబ్సా.. అన్న రేంజ్ లో ఫాన్స్ సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే ఇక్కడికి వారికి బాగానే ఉంది

కానీ సినిమా, సినిమాకి ఈ అల్లరి పెరుగుతూ వస్తుంది. అయితే కొంత మంది సినిమా ఎంజాయ్ చేయడం మానేసి, స్క్రీన్ లని చింపటం, సీట్ లు విరగొట్టం లాంటి పనులు చేస్తున్నారు. అడిగితే ఫ్యాన్స్ అంటారు . కారణంగా సినిమా చూడటానికి వచ్చిన మిగితా వాళ్ళకి, మరియు థియేటర్ యాజమాన్యనికి ఎలా రియాక్ట్ అవ్వాలో తెలియని పరిస్థితి నెలకొంటుంది. అయితే నిన్న ఈ పరిస్థితి ఇంకాస్త హద్దు దాటింది.

- Advertisement -

ఏప్రిల్ 8 బన్నీ బర్త్ డే ఉండటంతో, బన్నీ కెరీర్ లోనే గుర్తుండిపోయే సినిమాగా చెప్పుకునే “దేశముదురు” సినిమాని 4K మాస్టరింగ్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ టి సి క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్ లో నిన్న కొంత మంది ఫ్యాన్స్ థియేటర్ లోపల క్రాకర్స్ పేల్చి హడావిడి చేసారు. థియేటర్ స్టాఫ్ పోలీస్ లకి కాల్ చేసారు. వెంటనే పోలీస్ లు వచ్చి మందలించటంతో ఆపేసారు. అయితే ఇది మొదటిసారేం కాదు స్టార్ట్ హీరోల సినిమాలకి రెగ్యులర్ ఇలాంటివి అక్కడక్కడా జరుగుతూనే వస్తున్నాయి.

ఎవరికి ఎలాంటి హాని జరగనంత వారికి మంచిదే గాని, పరిస్థితి ఇలాగే కొనసాగితే పరిణామాలు ఇలా ఉంటాయో వారి వారి విజ్ఞతకే వదిలేయాల్సిన విషయం. థియేటర్ లో మీ హీరో ఉన్నాడు సరే కానీ ఇంట్లో మీ పేరెంట్స్ కూడా ఉన్నారు గుర్తుంచుకోండి.

సో మ్యాటర్ ఏంటంటే హ్యాపీ గా సీట్లో కూర్చొని సినిమా చుడండి, కానీ సీట్ లు విరగగొట్టకండి
స్క్రీన్ మీద హీరో వస్తే విజిల్ వేయండి గాని స్క్రీన్ ని కాల్చడం, కొయ్యడాలు చేయకండి.
ఫైనల్లీ లాస్ట్  పాయింట్ ఏంటంటే క్రాకర్స్, టపాసులు ధియేటర్ బయట కాల్చండి కానీ .థియేటర్లో కాల్చకండయ్యా థియేటర్ లు పేలిపోతాయి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు