Pawan Kalyan: పవన్ పోస్టర్ పై ఎట్టకేలకు క్లారిటీ వచ్చేసింది..!

హరీష్ శంకర్ డైరెక్షన్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. బ్లాక్ బస్టర్ హిట్ గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్, హరీష్ శంకర్ కాంబినేషన్లో సినిమా వస్తుండటంతో  మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ఒకటి రిలీజ్ చేసింది సినిమా యూనిట్. దీంతో ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుందా అని ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ సినిమా సెట్స్ మీదకు వెళ్లిందన్న క్లారిటీ వచ్చేసింది. అంతా బాగానే ఉన్నప్పటికీ సినిమా యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్ పై గందరగోళం నెలకొంది సోషల్ మీడియాలో.

సదరు పోస్టర్లో పోలీస్ యూనిఫామ్ లో ఉన్న పవన్ కళ్యాణ్ వెనక్కు తిరిగి ఉండటమే ఈ గందరగోళానికి దారితీసింది. ఆ పోస్టర్ లో ఉన్నది పవన్ కళ్యాణ్ కాదు, డైరెక్టర్ హరీష్ శంకర్ అంటూ జోరుగా ప్రచారం సాగింది. గతంలో గబ్బర్ సింగ్ సినిమాలో ఒక సీన్ పవన్ కి బదులు హరీష్ పోలీస్ డ్రెస్ లో కనిపించటం ఇంకా మరిచిపోని నెటిజన్స్ ఈ ప్రచారం నిజమే అని నమ్మారు. అయితే డైరెక్టర్ హరీష్ శంకర్ నుండి ఎలాంటి క్లారిటీ అయితే రాలేదు కానీ, కలర్ ఫోటో సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ సందీప్ రాజ్. తాను స్వయంగా పోస్టర్ షూట్లో పాల్గొన్న విషయాన్ని తన ట్విట్టర్లో షేర్ చేయటంతో అక్కడున్నది పవనే అన్న క్లారిటీ వచ్చేసింది.

పోస్టర్ షూట్ కోసం సెట్స్ కి వెళ్లిన సందీప్ రాజ్ ట్విట్టర్ ద్వారా డైరెక్టర్ హరీష్ శంకర్ కు కృతఙ్ఞతలు తెలియజేయడంతో ఈ గందరగోళానికి తెరపడ్డట్టు అయ్యింది. పవన్ కళ్యాణ్ ను నేరుగా చూడటం ఇదే మొదటిసారి అని, ఈ జ్ఞాపకం తనకు చిరకాలం గుర్తుంచుకోదగింది అంటూ తన ఆనందాన్ని వ్యక్తం చేసాడు సందీప్ రాజ్. మరి, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న పవన్ హరీష్ శంకర్ కాబినేషన్ మళ్ళీ హిట్ ఇస్తుందా లేదా అన్నది తెలియాలంటే సినిమా రిలీజ్ వరకు వేచి చూడాల్సిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు