Ram Charan: ఆరెంజ్ సినిమాకు ఆ టైటిల్ ను ఎందుకు పెట్టారో తెలుసా ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన ఆరెంజ్ చిత్రం ఆ రోజుల్లో ఎంత పెద్ద డిజాస్టర్ అయ్యిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మగధీర వంటి భారీ ఇండస్ట్రీ హిట్ తర్వాత రామ్ చరణ్ నుండి వచ్చిన సినిమా కావడం, విడుదలకు ముందు పాటలు కూడా సెన్సేషనల్ హిట్ అవ్వడం వల్ల సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి. కానీ, ఆ అంచనాలను అందుకోలేక ఆ రోజుల్లో ఈ సినిమా పెద్ద ఫ్లాప్ అయింది.

ఇక ఈ సినిమా నిర్మాత నాగబాబు అయితే తీవ్రమైన అప్పుల పాలయ్యాడు. అయితే ఈ సినిమా అప్పట్లో థియేటర్లలో ఆడలేదు. కానీ ప్రస్తుతం ఈ సినిమాకు చాలా మంది యూత్ కనెక్ట్ అయ్యారు. సినిమా విడుదలై టీవీలో ప్రసారమైన తర్వాత సినిమాకు ఫిదా అయ్యారు. అంతేకాకుండా ఈ సినిమాలోని పాటలు అన్నీ సూపర్ హిట్ అయ్యాయి. దాంతో మ్యూజికల్ హిట్ గా కూడా ఈ సినిమా నిలిచింది. ఇటీవల ఈ మూవీ రీ రిలీజ్ కూడా అయింది. మూడు రోజుల పాటు థియేటర్స్ లో ఒక పండగ వాతావరణం నెలకొంది.

అయితే ఆరెంజ్ సినిమా అంటే చాలామందికి ఫేవరెట్ సినిమా. కానీ, ఆ సినిమాకు ఆరెంజ్ అనే పేరు ఎందుకు పెట్టారో మాత్రం తెలియదు. సినిమాలో ఎక్కువగా నిజం మాట్లాడటం, నిజంగా ప్రేమించడం అనే పదాలు వింటూ ఉంటాం. కాగా ఆరెంజ్ అనే పదం ట్రూత్ ను రిప్రెజెంట్ చేస్తుంది. అందువల్లే ఈ సినిమాకు ఆరెంజ్ అనే టైటిల్ ఎంపిక చేస్తారని ఒక టాక్ ఉంది. మరోవైపు సినిమాలో చాలా సీన్లలో ఆరెంజ్ కలర్ ను చూపించిన సంగతి కూడా తెలిసిందే.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు