Lady Superstar 75: ఆ స్టార్ తో మళ్లీ నయనతార రొమాన్స్!

ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్ గా కొనసాగుతుంది నాయనతార. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దాదాపు 20 ఏళ్లు గడిచిపోతుంది. అయితే అప్పటికి ఇప్పటికీ నయనతార సినిమాల విషయంలో తీసుకునే నిర్ణయాలలో ఎంతో మార్పు వచ్చింది. ఒకప్పుడు హీరోల సరసన కేవలం గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే నటించేందుకు ఒప్పుకుంది. ఇక ఇలా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది. అయితే గతేడాది నయనతార పెళ్లి చేసుకోవడంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పనుందని ప్రచారం జరిగింది.

గతంలో అంగీకరించిన సినిమాల్లో మాత్రమే నటిస్తుందని అందరూ అనుకున్నారు. తాజాగా ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ ఓ ప్రకటన విడుదల చేసింది. తమిళ హీరో జై పుట్టినరోజు సందర్భంగా జీ స్టూడియోస్ తాజాగా ఓ ప్రత్యేక పోస్టర్ ను విడుదల చేసింది. చూడగానే పక్కింటి అబ్బాయిల కనిపించే హీరో జై.. లేడీ సూపర్  స్టార్ 75వ చిత్రంలో హీరోగా నటించనున్నాడు అని అధికారికంగా పేర్కొంది.

దీంతో నయనతార ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పదేళ్ల క్రితం జై, నయనతార కలిసి నటించిన రాజా రాణి సినిమా సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. వీరిద్దరి జంట థియేటర్లలో ఉన్నప్పుడు నవ్వులు పూయించింది. ఇప్పుడు దశాబ్దం తర్వాత మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో తమిళ, తెలుగు ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.

- Advertisement -

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు