Sneha: ఆ నిర్మాత తో హీరోయిన్ స్నేహ రిలేషన్ ?

హీరోయిన్ స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. పద్ధతికి మారుపేరుగా నిలిచినటువంటి సౌందర్యం మరణాంతరం ఇండస్ట్రీలో ట్రెడిషనల్ బ్యూటీగా చలామణి అవుతున్న హీరోయిన్ స్నేహ. ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి వివాదాలలో ఇరుక్కోకుండా సక్సెస్ఫుల్ గా ఇటు తన జీవితాన్ని అటు తన సినీ కెరియర్ ను కొనసాగిస్తున్నది స్నేహ.

తొలివలపు అనే సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరోయిన్ స్నేహ…. మొదటి సినిమాతోనే బంపర్ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో తొట్టెంపూడి గోపి సరసన నటించి అందరిని మెప్పించింది. ఆ తర్వాత ప్రియమైన నీకు, హనుమాన్ జంక్షన్, శ్రీరామదాసు మరియు సంక్రాంతి లాంటి ఫ్యామిలీ సినిమాలు చేసి సంచలనమే సృష్టించింది.

ఇక 2012 సంవత్సరంలో ప్రసన్నతో స్నేహ వివాహం జరిగింది. వీరిద్దరికీ ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే తాజా సమాచారం మేరకు ప్రసన్న కంటే ముందు ఓ నిర్మాతను స్నేహ ప్రేమించిందట. వీరిద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అనుకున్నారట. అయితే స్నేహ ఇంట్లో ఒప్పుకోకపోవడంతో వీరి పెళ్లి క్యాన్సిల్ అయింది అని సమాచారం. అయితే ఇప్పుడు ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు