Tollywood: హన్సిక ఆశలన్నీ శృతిపైనే! కానీ సెట్టవుతుందా?

టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఒకరిగా వరుస సినిమాలతో దూసుకెళ్లిన హన్సిక గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దేశముదురు తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఫస్ట్ మూవీ నుండే స్టార్ హీరోల సినిమాల్లో వరుస ఆఫర్లు దక్కించుకుంది. అయితే ఆ తరువాత హిట్లు మాత్రం కరువయ్యాయి. ప్లాపులు కూడా వరుస బెట్టి పలకరించడంతో అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో తమిళ ఇండస్ట్రీ కి వెళ్ళిపోయింది. అక్కడ కూడా స్టార్టింగ్ లో కొన్ని హిట్స్ పడ్డా తర్వాత ప్లాపులు వచ్చేసరికి అవకాశాలు రాలేదు.

ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత తనకి లైఫ్ ఇచ్చిన టాలీవుడ్ ని మరోసారి నమ్ముకుంది. శ్రీనివాస్ ఓంకార్ డైరెక్ట్ చేసిన “మై నేమ్ ఈజ్ శృతి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. పైగా ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ సినిమా కావడం వల్ల హన్సిక కి అడ్వాంటేజ్ గా మారుతుంది. క్లిక్ అయితే క్రెడిట్ ఎక్కువ శాతం హన్సిక కే దక్కుతుంది.

ఇక ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్ లో తెరకెక్కగా, ట్రైలర్ బాగున్నప్పటికీ ఆడియన్స్ లో సరైన బజ్ క్రియేట్ కాలేదని చెప్పాలి. చేస్తున్న ప్రమోషన్లు కూడా ఇంపాక్ట్ చూపడం లేదు. ఇక ఈ సినిమా మౌత్ టాక్ పైనే డిపెండ్ అయ్యి నవంబర్ 17న రిలీజ్ అవుతుంది. హన్సిక చేతిలో ఇతర సినిమాల ఆఫర్లు కూడా లేవు కాబట్టి, శృతి సినిమాపైనే హన్సిక సినిమా కెరీర్ ఆధారపడిందని చెప్పొచ్చు. అది తనకి కూడా తెలుసు కాబట్టే ప్రమోషన్లు కూడా దగ్గరుండి చేస్తుంది. మరి “మై నేమ్ ఈజ్ శృతి” హన్సిక కి ఇండస్ట్రీ లోకి దరి చూపుతుందో లేక రహదారి చూపుతుందో రిలీజ్ అయ్యాక తెలుస్తుంది.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు