My Name is Shruthi: వైశాలి ని మర్చిపోయి… శృతిని గుర్తుపెట్టుకుంటారా.?

హవా సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా బాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది హన్సిక మోత్వాని. కోయి మిల్ గయా సినిమాతో మంచి పేరును సాధించుకుంది. 2007లో పూరి జగన్నాథ్ దర్శకుడుగా అల్లు అర్జున్ హీరోగా వచ్చిన “దేశముదురు” సినిమాతో హీరోయిన్ గా తెలుగులో తెరంగేట్రం చేసింది హన్సిక. ఆ సినిమా హిట్ అవడంతో హన్సికకు వరుస అవకాశాలు వచ్చాయి. ఆ సినిమాలో పూరి జగన్నాథ్ హన్సిక చూపించిన విధానం ఇప్పటికి చాలా పద్ధతిగా అనిపిస్తుంది. హీరోయిన్ ని ఒక సన్యాసిగా చూపించడం అనేది గ్రేట్ థింగ్ అని చెప్పొచ్చు.

ఆ సినిమా హిట్ అయిన తర్వాత ఎన్టీఆర్ ప్రభాస్ వంటి హీరోలతో కూడా హన్సికకి మంచి అవకాశాలు వచ్చాయి. అయితే ఎన్టీఆర్ తో చేసిన కంత్రి, ప్రభాస్ తో చేసిన బిల్లా సినిమాలు అంతగా ఆడలేదు. రామ్ సరసన నటించిన మస్కా, కందిరీగ సినిమాలు ఓకే అనిపించుకున్నాయి. మంచి అంచనాలతో వచ్చిన “ఓ మై ఫ్రెండ్” సినిమా కూడా హన్సిక కి సరైన హిట్ ను అందించలేదు.

తెలుగు తమిళ భాషల్లో ఎన్ని సినిమాలు చేసినా కూడా హన్సిక మోత్వానికి సరైన హిట్ అంటే “దేశముదురు” అని మాత్రమే చెప్పొచ్చు. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు హన్సిక అంటే టక్కున గుర్తొచ్చే సినిమా అంటూ ఏదీ లేకుండా పోయింది. ప్రస్తుతం హన్సిక చేస్తున్న సినిమా “మై నేమ్ ఇస్ శ్రుతి” ఈ సినిమా ట్రైలర్ రీసెంట్ గా రిలీజ్ అయింది. హన్సిక న‌టిస్తున్న లేడీ ఓరియెంటెడ్ చిత్రం. నవంబర్ 17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.శ్రీ‌నివాస్ ఓంకార్ ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ఈ లేడి ఓరియెంటెడ్ సినిమా ద్వారా అయినా దేశముదురు లో వైశాలి ని మర్చిపోయి , శృతిని గుర్తుపెట్టుకుంటారో లేదో చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు