Trivikram: నవంబర్ 7 సెంటిమెంట్… మళ్లీ అజ్ఞాతవాసి గుర్తొస్తుంది

త్రివిక్రమ్ శ్రీనివాస్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఉన్న బాండింగ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.  బేసిగ్గా వీరిద్దరికీ బాండింగ్ జల్సా సినిమా నుంచి మొదలైంది అని అనుకుంటారు చాలామంది.  కానీ గోకులంలో సీత సినిమాకి పోసాని మురళీకృష్ణ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా  పనిచేస్తున్న అప్పటినుంచి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పవన్ కళ్యాణ్ కి మధ్య  మంచి సాన్నిహిత్యం ఉంది.  వీరిద్దరి కాంబినేషన్లో ఇప్పటికీ మూడు సినిమాలు వచ్చాయి.  జల్సా సినిమా మంచి రిజల్ట్ ని తెచ్చి పెట్టింది ఆ తర్వాత వీరి కాంబినేషన్లో వచ్చిన “అత్తారింటికి దారేది” సినిమా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ గా నిలిచింది.

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి సినిమా చేయకపోయినా కూడా, పవన్ కళ్యాణ్ చేసే సినిమాలలో త్రివిక్రమ్ రైటింగ్ పరంగా ఇన్వాల్వ్ అవుతున్న సంగతి తెలిసిందే.  అయితే ప్రస్తుతం త్రివిక్రమ్ , సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా “గుంటూరు కారం” సినిమాను చేస్తున్నాడు.  ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కానుంది.  ఇదివరకే మహేష్ తో అతడు, ఖలేజా సినిమాలు చేశాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆ సినిమాలు కమర్షియల్ గా హిట్ కాలేదు.  అందుకని గుంటూరు కారం సినిమాని కమర్షియల్ గా హిట్టయ్యే దిశగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.

నవంబర్ 7న త్రివిక్రమ్ శ్రీనివాస్ బర్తడే సందర్భంగా ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ని రిలీజ్ చేయనున్నారు.  ఇక్కడే అందరికీ ఒక డౌట్ మొదలవుతుంది 2018 లో పవన్ కళ్యాణ్ తో మూడవసారి పనిచేసిన త్రివిక్రమ్ అజ్ఞాతవాసి మొదటి సాంగ్ కూడా నవంబర్ 7న రిలీజ్ చేశారు.  ఆ సినిమా సంక్రాంతికి రిలీజ్ అయింది.  ఆ సినిమా ఫలితాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

- Advertisement -

ప్రస్తుతం ఇప్పుడు కూడా గుంటూరు కారం నుంచి ఫస్ట్ సింగిల్ ని ఏడో తారీఖు రిలీజ్ చేస్తున్నారు.  ఈ సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది పవన్ కళ్యాణ్ తో మూడో సినిమా డిజాస్టర్ గా మిగిలినా,  మహేష్ బాబుతో మూడవ సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ అయ్యే దిశగా మలుస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.  ఏదేమైనా అజ్ఞాతవాసికి వచ్చిన రిజల్ట్ రిపీట్ అవ్వకుంటే, అదే చాలు అనేది మహేష్ అభిమానుల బలమైన కోరిక.

For More Updates :
Checkout Filmify for the latest Movie updates, Web Stories, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు