Japan: పవర్ స్టార్ వల్లే కాలేదు… కార్తీ కాపాడుతాడా?

మజ్ను సినిమాతో తెలుగులో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది అను ఇమ్మానుయేల్. ఆ తర్వాత మళ్లీ రాజ్ తరుణ్ సరసన “కిట్టు ఉన్నాడు జాగ్రత్త” సినిమాలో నటించింది ఈ రెండు సినిమాలు తెలుగులో పెద్దగా ఆడలేదు. అయినా కూడా తన మూడవ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో చేసే అవకాశం లభించింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ , పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన “అజ్ఞాతవాసి” సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించింది అను ఇమ్మానియేల్. అయినా ఈ సినిమా గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే అది గురూజీ ఇచ్చిన జ్ఞాపకం కాదు , గురూజీ దించిన గునపం.

అజ్ఞాతవాసి డిజాస్టర్ కావడంతో మళ్లీ తనకి అవకాశాలు పెద్దగా లేకుండా పోయాయి. ఎట్టకేలకు అల్లు అర్జున్ సరసన చేసిన “నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా” సినిమా కూడా భారీ డిజాస్టర్ అయింది. ఆ సినిమా కేవలం అనూకే కాదు, బన్నీ కూడా కొంత గ్యాప్ ఇచ్చింది. ఆ తర్వాత “గీతగోవిందం” చేసినా అది, గెస్ట్ రోల్ లానే మిగిలిపోయింది. నాగచైతన్య సరసన “శైలజ రెడ్డి అల్లుడు” అంతంత మాత్రమే ఆడింది.

అందం, టాలెంట్ అన్నీ ఉన్నకూడా ఈ బ్యూటీకి ఇప్పటివరకు సరైన హిట్టు పడలేదు. సరే వీటన్నిటినీ పక్కనపెట్టి, తనలో ఉన్న రొమాన్స్ యాంగిల్ ని కూడా బయటికి తీస్తూ “ఊర్వశివో రాక్షసివో” సినిమాలో శిరీష్ సరసన నటించి నటించింది. ఆ సినిమాకి మంచి రివ్యూస్ వచ్చాయి కానీ కమర్షియల్ గా పెద్దగా హిట్ కాలేకపోయింది. ఆ సినిమా తర్వాత ఇప్పటివరకు అనూకి అవకాశాలు లేకుండా పోయాయి. తర్వాత రవితేజ నటించిన రావణాసుర సినిమా కూడా దేనికి ఉపయోగపడకుండా వెళ్ళిపోయింది.

- Advertisement -

ప్రస్తుతం కార్తీ సరసన “జపాన్” అనే సినిమాలో అను ఇమ్మానియేల్ నటిస్తుంది. ఈ సినిమాపైనే హోప్స్ ఉన్నాయి. జపాన్ హిట్ అయితే, అను కెరీర్ నిలబడుతుంది. లేకపోతే కెరీర్ ఎండ్ కి వచ్చినట్టే. అయితే అను కెరీర్ ని నిలబెట్టడం పవర్ స్టార్ పవన కళ్యాణ్ వల్లే కాలేదు, ఇప్పుడు కార్తీతో అవుతుందా అని కామెంట్స్ వస్తున్నాయి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు