Pawan Kalyan: ఇందుగలడు అందులేడు అని సందేహం వలదు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఇది కేవలం పేరు మాత్రమే కాదు ఇది ఒక ప్రభంజనం. పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  అలా అని ఎంత చెప్పినా ఎంతో కొంత మిగిలి ఉంటుంది అది ఆయన క్రేజ్.  జానీ సినిమా తర్వాత పదేళ్లు హిట్టు లేకపోయినా కూడా తన కెరీర్ ని, తన క్రేజ్ ని  అంచలంచలుగా పెంచుతూ వచ్చాడు.
అది కేవలం పవన్ కళ్యాణ్ కి మాత్రమే సొంతమని చెప్పొచ్చు.

పవన్ కెరియర్లో చాలా ఏళ్ల తర్వాత వచ్చిన జల్సా సినిమా ఒక ఊరట కలిగించింది. అయితే జల్సా హిట్ తర్వాత వచ్చిన గబ్బర్ సింగ్ సినిమా హిట్ పవన్ అభిమానులకు కొత్త ఊపిరిని అందించింది. ఇండస్ట్రీని కుదిపేసింది.  గబ్బర్ సింగ్ క్రియేట్ చేసిన మేనియా గురించి ఇప్పుడు ఎంత చెప్పినా తక్కువే అవుతుంది.  తెలుగు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ని బ్యాండ్ వాయించింది గబ్బర్ సింగ్ సినిమా.

అందుకే పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఎన్ని ప్రాజెక్ట్స్ చేసిన హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న “ఉస్తాద్ భగత్ సింగ్” సినిమా పైన భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే హరీష్ శంకర్ కు పవన్ కళ్యాణ్ ని ఎలా చూపించాలో, ఒక అభిమానిగా బాగా తెలుసు.

- Advertisement -

హరీష్ తన సినిమా ద్వారా ఎడ్యుకేట్ చేయలేను కాబట్టి ఎంటర్టైన్ చేస్తాను  అంటాడు.  పవన్ కళ్యాణ్ ని ఆడియన్స్ ఎలా చూస్తే ఎంటర్టైన్ అవుతారని  హరీష్ కి ఆ పల్స్ బాగా తెలుసు.  ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు,  ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలతో పాటు ఓజీ సినిమా కూడా చేస్తున్నాడు.

అయితే ఇక్కడ అందరికీ ఒక సందేహం ఏర్పడుతుంది రాజకీయాల్లో  యాక్టివ్ గా ఉన్న పవన్ కళ్యాణ్.  ఒకరోజు రాజకీయ సభల్లోను, మరో రోజు ఉస్తాద్ భగత్ సింగ్ సెట్ లోను  కనిపిస్తూ వచ్చాడు.  ఇంక రీసెంట్ వరుణ్ తేజ్,లావణ్య పెళ్లి నిమిత్తం ఇటలీ కూడా బయలుదేరి నేడు ఎయిర్పోర్టు లో దర్శనమిచ్చారు. ఒకరోజు షెట్ లో, ఒకరోజు రాజకీయ సభల్లో, ఒకరోజు సినిమా షూటింగ్లో కనిపించడం వలన పవన్ కళ్యాణ్ ని “ఇందు గలడు అందు లేడు అని సందేహం వలదు” అనే రేంజ్ లో ఎలివేషన్ ఇస్తున్నారు.  మొత్తానికి ఒకవైపు పాలిటిక్స్, మరోవైపు ఫ్యామిలీ ఫంక్షన్స్,  మరోవైపు సినిమాలను చకచకా పూర్తి చేస్తూ కెరియర్లో బిజీగా ఉన్నాడు పవర్ స్టార్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు