Rakshith Shetty: సప్త సాగరాలు దాటి(side-B) ప్రియ కోసం మను..

కన్నడ స్టార్ రక్షిత్ శెట్టి నటించిన “సప్త సాగరాలు దాటి” కన్నడ లో ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎమోషనల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ సినిమాను హేమంత్ దర్శకత్వం వహించాడు. సెప్టెంబర్ 1న రిలీజ్ అయిన ఈ సినిమా కన్నడలో సూపర్ హిట్ అవగా, కన్నడలో రిలీజ్ అయిన వారం తర్వాత తెలుగులో కూడా రిలీజ్ అయింది. ఇక్కడ మంచి టాక్ తెచ్చుకున్నప్పటికీ స్క్రీన్ ప్లే ల్యాగ్ ఎక్కువవడంతో అంతగా ఆడలేదు. పైగా ప్రమోషన్స్ కూడా పెద్దగా చేయలేదు.

అయితే ఓటిటి లో రిలీజ్ అయ్యాక మాత్రం సాలిడ్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగు, తమిళ్ అని కాకుండా ఎగబడి చూసేసారు. ఇక ఇప్పుడు ఈ సినిమాకి రెండో పార్ట్ వచ్చేస్తుంది. మొదటి పార్ట్ లో హీరో మను తను ప్రేమించిన అమ్మాయి ప్రియతో పెళ్ళికి రెడీ అవుతుండగా, అనుకోకుండా ఓ ఆక్సిడెంట్ కేసులో చిక్కుకుంటాడు. ఆ తర్వాత కథ అనుకోని మలుపులు తీసుకుని హీరో, హీరోయిన్లు దూరమవుతారు.

ఇప్పుడు సప్త సాగరాలు దాటి రెండో పార్ట్ రాబోతుంది. తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తూ టీజర్ రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో హీరో జైలు నుండి రిలీజ్ అయినట్టు చూపిస్తూ, బయటికి వచ్చి ఏం చేసాడు అన్న సస్పెన్స్ లో ఉంచారు. అయితే ఫస్ట్ పార్ట్ చూసిన వాళ్లకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. మను లైఫ్ ఇలా అవ్వడానికి కారణమైన వాళ్ళ మీద రివెంజ్ తీర్చుకుంటాడు అని, కానీ అది ఎలా? మను ప్రియని చివరికి కలుసుకుంటాడా? లేదా? అన్నదే రెండో పార్ట్ లో చూపించబోతున్నారు.

- Advertisement -

ఇక రిలీజ్ చేసిన టీజర్ ద్వారా సప్త సాగరాలు దాటి సైడ్ B ని నవంబర్ 17న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేయడం జరిగింది. అయితే ఫస్ట్ పార్ట్ థియేటర్లలో చూడకపోయినా, ఓటిటి రెస్పాన్స్ ఇచ్చిన ఇంపాక్ట్, ఆడియన్స్ ని థియేటర్లకు రప్పిస్తుంది అని మేకర్స్ నమ్ముతున్నారు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు