Sapta Sagaralu Daati: తెలుగులో రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న కన్నడ క్లాసిక్ “స‌ప్త సాగారాలు దాటి”

Sapta Sagaralu Daati

ఇటీవలనే కన్నడలో రిలీజైన ..సప్త సాగర యెల్లో సినిమా కన్నడిగులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ వద్ద క్లాసిక్ హిట్ గా నిలిచింది. రక్షిత్ శెట్టి, రుక్మిణి వసంత్ జంటగా నటించిన ఈ ఎమోషనల్ లవ్ డ్రామా హైదరాబాద్ లో కూడా పలు థియేటర్స్ లో కన్నడ లాంగ్వేజిలో ప్రదర్శించబడింది. దాంతో ఇక్కడి ప్రేక్షకులకు కూడా కొంతమంది ఈ సినిమా చూసి వాళ్లకు నచ్చడంతో ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. స్లో పాయిజన్ లాగా సినిమాకు వస్తోన్న ఆదరణను గమనించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రస్తుతం ఈ సినిమాని “స‌ప్త సాగారాలు దాటి” అనే పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తోంది.

ఇటీవల కాలంలో మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ప్రోత్సహిస్తు వస్తున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమా డబ్ చేసి రిలీజ్ చేస్తుండటంతో సినిమాకి మంచి బజ్ స్టార్ట్ అయింది. ఇక కాసేపటి క్రితమే స‌ప్త సాగార దాటి సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ చేయడం జరిగింది. రుక్మిణి వసంత్ వాయిస్ ఓవర్ డైలాగ్ తో స్టార్ట్ అయిన ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం తెలుగు డబ్బింగ్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాని సెప్టెంబర్ 22 ప్రేక్షకులు ముందుకు రాబోతుంది.

అయితే నిజానికిస‌ప్త సాగారాలు దాటి సినిమా కన్నడలో రెండు భాగాలుగా చిత్రీకరించబడింది. మొదటి భాగం ఇప్పటికే కన్నడలో రిలీజై సూపర్ హిట్ అవ్వగా రెండవ భాగం అక్టోబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. సెప్టెంబర్ 22 మొదటి భాగాన్ని తెలుగులో రిలీజ్ చేసి, అక్టోబర్ లో తెలుగు, కన్నడలో ఒకేసారి రిలీజ్ చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు