Anushka: సెకండ్ ఇన్నింగ్స్ లో బిజీ అవుతున్న అనుష్క

Anushka

ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా చెలామణి అయిన అనుష్క జోరు ఇటీవల కాలంలో చాలా వరకు తగ్గిపోవడం చూస్తూనే ఉన్నాం. అప్పట్లో సినిమా మీద సినిమాలు చేస్తూ ఎప్పుడు బిజీ, బిజీగా ఉండే అనుష్క కు గతకొద్దీ రోజులుగా సినిమాలు రావడమే కష్టమైపోయింది.

నిజానికి అనుష్క సినిమాలు దూరంగా ఉండటానికి కారణం. ఆమె నటించిన సైజ్ జీరో సినిమా అనే చెప్పాలి. ఆ సినిమా వల్ల ఆమెకు వచ్చిన కొన్ని ఆరోగ్య సమస్యలే అనుష్క కెరీర్ కు బ్రేక్ వేసాయి. సైజ్ జీరో సినిమాలో ఓవర్ వేట్ ఉన్న పాత్రను పోషించడానికి గాను అనుష్క వేట్ పెరగటం వల్ల ఆమెకు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చాయి. దాంతో ఆమె మునుపటిలాగా చక చక సినిమాలు చేయలేకపోతోంది. ఇక ఇటీవలనే ఆమె ఆరోగ్యం కాస్త కుదుట పడటంతో అనుష్క మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమాలో నటించింది.

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 7 విడుదలైంది. ప్రస్తుతం థియేటర్స్ లో విజయవంతంగా ప్రదర్షింపబడుతూఈ సినిమా బ్లాక్ బస్టర్ దిశగా దూసుకుపోతుంది. ఇక ఈ సినిమాతో అనుష్క సెకండ్ ఇన్నింగ్స్ కెరీర్ సూపర్ స్టార్ట్ అయిందని చెప్పవచ్చు. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి సినిమా సక్సెస్ ప్రస్తుతం అనుష్క కు మళ్ళీ పూర్వం లాగ బిజీ హీరోయిన్ చేసేటట్టు ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో సీనియర్ హీరోలకు.. హీరోయిన్స్ కష్టాలు వస్తుండటంతో ప్రస్తుతం ఉన్న సీనియర్లంతా తమ రాబోయే సినిమాలలో అనుష్క ను హీరోయిన్ గా తీసుకోవడానికి చూస్తున్నారట.

- Advertisement -

ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి బింబిసార ఫేం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో చేయబోయే సినిమా కోసం గాను అనుష్కను సంప్రదించినట్టు టాక్ వస్తుంది. అలాగే నాగార్జున నటిస్తోన్న నా సామి రంగ సినిమాలో కూడా అనుష్క నే హీరోయిన్ తీసుకునే ప్లాన్ లో ఉన్నాడట నాగ్. త్వరలోనే ఈ రెండు సినిమాలపై అనుష్క క్లారిటీ ఇవ్వగానే అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు