Anushka : సమంతను నిండా ముంచేసిన అనుష్క..!

Anushka

గత కొంతకాలంగా సినిమాలపరంగా, అటు వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమంత తాజాగా శివ నిర్వాణ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ తో కలిసి ఖుషి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది. సెప్టెంబర్ 1న విడుదలైన ఈ అందమైన ప్రేమకథా చిత్రం అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా విజయ్ – సమంత మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఫిదా చేసింది. ఫస్ట్ వీకెండ్ లోనే ఈ చిత్రానికి అదిరిపోయే వసూళ్లు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ మూవీ 70 కోట్లు కొల్లగొట్టిందని ప్రచారం జరిగింది.

కానీ ఈ వారంలో వసూళ్లు మెల్లమెల్లగా డ్రాప్ అవుతూ వచ్చాయి. ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాలలో ఈ సినిమా ఇంకా వసూళ్లు రాబట్టాల్సి ఉంది. కానీ వారం రోజుల గ్యాప్ లో “మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చింది అనుష్క శెట్టి. ఈ సినిమాకి కూడా మంచి టాక్ వచ్చింది. ఖుషి చిత్రం మంచి వసూళ్లతో దూసుకుపోతున్న సమయంలో అటు జవాన్ తో పాటు ఇటు అనుష్క సినిమా కూడా రిలీజ్ అయింది.

దీంతో ఖుషి ఆడుతున్న చాలా స్క్రీన్లు తగ్గించేసి జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు ఇచ్చేశారు. అంతేకాకుండా దాదాపు 5 సంవత్సరాల తర్వాత అనుష్క వెండితెరపై కనిపించడంతో ప్రేక్షకులు, అభిమానులు ఆమె సినిమా వైపే మొగ్గు చూపారు. దీంతో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖుషిని చూడడం కష్టమే అనుకోవాలి. ఈ నేపథ్యంలో ఖుషి సినిమాకి 15 కోట్ల వరకు నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మొత్తంగా అనుష్క రీఎంట్రీతో సమంతని నిండా ముంచేసిందని కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries.

Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు