Shilpa Shetty: మొదటిసారి అలాంటి వాళ్ళ గురించి నోరు విప్పిన శిల్పా శెట్టి

Shilpa Shetty

ఇంస్టాగ్రామ్ క్వీన్ గా నెటిజన్లతో ఎప్పుడు పొగడ్తలు అందుకునే బాలీవుడ్ నటి శిల్పా శెట్టి గురించి అందరికి తెలిసిందే. ఎప్పటికప్పుడు తన ఫిట్ నెస్ వీడియోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ.. యాక్టివ్ గా ఉండే శిల్ప శెట్టి మొదటిసారి ఒక విషయంపై స్పందించింది. అదేంటంటే..

శిల్పా శెట్టి వైవాహిక జీవితంపై సోషల్ మీడియాలో ఎప్పుడు చర్చలు జరుగుతుండటం చూస్తూనే ఉంటాం. దానికి కారణం ఆమె భర్త రాజ్ కుంద్రా నీలి చిత్రాల కేసులో నిందితుడిగా అరెస్ట్ అవడమే. ఆసియన్ లోనే వన్ అఫ్ ది పవర్ ఫుల్ బిజినెస్ మ్యాన్ గా ఉన్న రాజ్ కుంద్రా నీలి చిత్రాలు నిర్మిస్తున్నాడనే అభియోగంలో అరెస్ట్ అవ్వగా.. అప్పట్లో ఈ న్యూస్ సంచలనం రేపింది. ఇక ఆ విషయంపై అప్పట్లో రకరకాలుగా వార్తలు వచ్చాయి. సోషల్ మీడియాలో శిల్పా శెట్టి యాక్టివ్ గా ఉంటుండటం చేత ఆమె భర్త విషయంలో శిల్పా శెట్టి విపరీతమైన ట్రోల్స్ కు గురి కావాల్సి వచ్చింది.

అయితే అదే విధమైన ట్రోల్ల్స్ ఆమె ప్రెగ్నెన్సీ టైం లో కూడా ఎదుర్కొంది. ప్రెగ్నెన్సీ సమయంలో శిల్పా శెట్టి కాస్త బొద్దుగా అవడంతో అందరి చేత ఆమె విమర్శించబడింది. కాగా కొన్ని నెలల పాటు అలాగే జరగగా ప్రెగ్నెన్సీ తరువాత ఆమె పూర్తిగా కోలుకొని వర్కౌట్స్ చేయడం స్టార్ట్ చేసింది, దాంతో కొద్దిరోజుల్లోనే ఆమె కోల్పోయిన నాజూకుతనం మళ్ళీ తిరిగి వచ్చేసింది. అయితే అప్పటిదాకా బొద్దుగా ఉన్న శిల్పా వెంటనే బరువు తగ్గడంతో అందరు ఆమెను ఇది ఎలా సాధ్యం అయిందని సోషల్ మీడియాలో టిప్స్ అడగటం స్టార్ట్ చేసారట. ఇక విషయం పై ఆమె లేటెస్ట్ గా స్పందిస్తూ బరువుగా ఉన్నప్పుడు నెగిటివ్ గా కామెంట్స్ చేసినవాళ్ళే ఇప్పడు టిప్స్ అడుగుతున్నారని చెప్పుకొచ్చింది.

- Advertisement -

అందుకే తానెప్పుడూ సోషల్ మీడియాలో ట్రోల్ చేసేవాళ్లను పట్టించుకోను అంటూ చెప్పింది. అలాగే  ట్రోలర్స్ తనగురించి ఆలోచించడాన్ని ఆమె సంతోషంగా స్వీకరిస్తాను అంతేగాని వాళ్ళ మాటలను ఎప్పడు సీరియస్ తీసుకోను అని ట్రోలర్స్ పై తన మనసులో మాటను బయటపెట్టింది శిల్పా శెట్టి.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు