Deepika Padukone: షారుఖ్ ఖాన్ అంటే దీపికా పదుకునే కు మరీ అంత ఇష్టమా ?

Deepika Padukone

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. ప్రస్తుతం ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ యాక్ట్రెస్ గా కొనసాగుతున్న దీపికా పదుకునే కు కేవలం ఇండియాలో కాదు యావత్ ప్రపంచమంతా ఆమెకు అభిమానులున్నారు. ఎంత ఎదిగిన ఒదిగి ఉండే ఆమె మనస్తత్వం, అందరిని ఆకట్టుకునే ఆమె వైఖరికి ఎవరైనా ఆమెకు అభిమానులు అవుతారు. అయితే ఎంత మంది అభిమానుల ప్రేమను చూరగొన్న దీపికా పదుకునే కు మాత్రం షారుఖ్ ఖాన్ అంటే అమితమైన ప్రేమ అని తెలుస్తోంది.

ప్రస్తుతం ఇండియాలో ఉన్న అందరి హీరోయిన్స్ అత్యధిక రెమ్యునరేషన్ తీసుకొంటున్న దీపికా పదుకునే ఇటీవలనే ఆమె షారుఖ్ తో కలిసి నటించిన జవాన్ సినిమాకు గాను ఒక్క రూపాయి పారితోషికం కూడా తీసుకోలేదట. ప్రస్తుతం ప్రభాస్ తో కల్కి సినిమాలో నటిస్తున్న దీపికా పదుకునే ఆ సినిమాకు 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ అందుకొందట కానీ అదే సమయంలో షూటింగ్ చేసిన జవాన్ సినిమాకు మాత్రం ఎలాంటి పారితోషికం లేకుండా నటించడం అందరికి ఆశ్చర్యాన్ని కలిసిగిస్తుంది.

అయితే దీపికా పదుకునే జవాన్ లో రెమ్యునరేషన్ లేకుండా నటించడానికి కారణం లేకపోలేదు. నిజానికి దీపికా పదుకునే ను హీరోయిన్ గా బాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేసింది షారుఖ్ ఖాన్. మొదటిసారి ఓం శాంతి ఓం సినిమాలో వీరిద్దరూ కలిసి నటించగా ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఆ తరువాత దీపికా పదుకునే బాలీవుడ్ బడా హీరోయిన్ అయిపొయింది. అందుకే తన లైఫ్ ఇచ్చిన షారుఖ్ ఖాన్ తో సినిమా చేయడానికి రెమ్యునరేషన్ ను కూడా కేర్ చేయకుండా ఆమె జవాన్ సినిమాలో నటించిందట.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు