Prabhas About Deepika Padukone: దీపికా పదుకునే పై ప్రభాస్ కామెంట్స్ వైరల్

Prabhas About Deepika Padukone

కల్కి 2898AD సినిమాలో దీపికా పదుకునేతో కలిసి నటిస్తోన్న ప్రభాస్, ఒక ఇంటర్వ్యూలో ఆమెపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయగా, ప్రస్తుతం ఇంటర్నెట్ లో ట్రెండ్ అవుతున్నాయి. సాధారణంగా హీరోయిన్స్ గురించి పెద్దగా మాట్లాడటానికి ఇష్టపడని ప్రభాస్ దీపికా పదుకునే గురించి మాత్రం ఒక రేంజ్ లో మాట్లాడగా, ఆయన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

వైజయంతి మూవీస్ బ్యానర్ పై సి. అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కల్కి 2898AD సినిమా గురించి అందరికి తెలిసిందే. పాన్ ఇండియా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో లోకనాయకుడు కమల్ హాసన్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, దిశాపటాని, దీపికా పదుకునే ప్రధాన తారాగణంగా నటిస్తున్నారు. ఇండియన్ మైథలాజితో పాటు, సైన్స్ ఫిక్షన్ టచ్ తో రూపొందించబడుతున్న ఈ సినిమా గ్లిమ్స్ ఇటీవలనే రిలీజై, ప్రేక్షకుల దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది.

ఇక ఈ సినిమా గురించి విశేషాలను పంచుకోవడానికి ఒక ఆంగ్ల పత్రికకు ప్రభాస్ ఇచ్చిన ఇంటర్వ్యూలో కల్కి 2898AD సినిమా గురించి ముచ్చట్లతో పాటు, దీపికా పదుకునే ను పొగడ్తలతో ముంచెత్తారు. దీపికా పదుకునే సెట్స్ లోకి వవస్తే, సెట్ అంత సందడిగా మారుతుందని, సెట్ లో అందరితో ఆమె చనువుగా మాట్లాడుతుందని. ఆమె ఎంత అందంగా ఉంటుందో నటన కూడా అంతే అద్భుతంగా చేస్తుందంటూ.. ప్రభాస్ దీపికా పదుకునే గురించి చెప్పుకొచ్చాడు.

- Advertisement -

ప్రభాస్ ఇంటర్వ్యూలలో హీరోయిన్స్ గురించి ఎప్పుడు పెద్దగా మాట్లాడింది లేకపోవడంతో, దీపికా పదుకునేపై ఆయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్కి 2898AD సినిమా ఈ సంక్రాంతి కానుకగా విడుదల అవ్వాల్సి ఉండగా, సినిమా విఎఫ్ఎక్స్ విషయంలో ప్రత్యేక కేర్ తీసుకోవాల్సి ఉందని సినిమాను రిలీజ్ ను వాయిదా వేశారు. తొందరలోనే కొత్త రిలీజ్ డేట్ ను మూవీ టీం ప్రకటించనున్నారు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు