Game Changer: గేమ్ చేంజర్ సినిమా సాంగ్ లీక్ చేసింది వాళ్లే

Game Changer

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ హీరో, హీరోయిన్స్ గా నటిస్తోన్న గేమ్ చేంజర్ సినిమా ఆడియో సాంగ్ లీక్ అయిన విషయం తెలిసిందే. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా దాదాపు ఏడాది పై నుంచి షూటింగ్ జరుపుకుంటుంది. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా నుంచి ఎలాంటి లీక్స్ జరగలేదు. కానీ మొదటి సారి ఏకంగా సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ రిలీజ్ అవడం అందరిని ఒక్కసారిగా షాక్ కు గురి చేసింది.

థమన్ మ్యూజిక్ అందిస్తున్న సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ ఈ విధంగా లీక్ అవడం ఇది రెండో సారి అని చెప్పాలి. గతంలో కూడా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పరుశరాం దర్శకత్వంలో తెరకెక్కిన సర్కారు వారి పాట సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా.. ఆ సినిమాలోకి కళావతి అనే పాట కూడా ఇదే విధంగా లీక్ అయింది. అఫీషియల్ గా రిలీజ్ కావాల్సిన ఒక్కరోజు ముందుగానే కళావతి సాంగ్ నెట్ లో దర్శనమిచ్చి హల్చల్ చేసింది. దాంతో మేకర్స్ సాంగ్ వెంటనే రిలీజ్ చేయవలసిన పరిస్థితి ఏర్పడింది. అలాగే ఇప్పుడు కూడా గేమ్ చేంజర్ సినిమా విషయంలోనూ ఇలాగే జరిగింది.

దీనిబట్టి చూస్తే థమన్ టీం లోనే ఉన్నవాళ్లే ఎవరో కావాలనే లీక్ చేయిస్తున్నారనే అనుమానాలు వస్తున్నాయి. ఇక కాసేపటి క్రితమే దిల్ రాజు సాంగ్ లీక్ చేసిన వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ కేస్ నమోదు చేసారు. ముందుగా థమన్ టీం ను మరియు లిరికల్ వీడియో క్రియేషన్ చేసే డిజిటల్ టీం ను విచారించనున్నారు పోలీసులు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు