Thaman: కాపీ అని తెలియక అనవసరంగా ఎలివేషన్ ఇచ్చారు

Thaman:

రీసెంట్ టైమ్స్ లో తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎస్ ఎస్ థమన్ ఒకరు. ప్రతి ఒక్కరి లైఫ్ ను ఇంకొకడు మలైపు తిప్పుతారు అని చెబుతుంటారు. థమన్ విషయంలో ఆ ప్రస్తావన వస్తే త్రివిక్రమ్ థమన్ లైఫ్ ను మలుపు తిప్పాడు అని చెప్పొచ్చు. స్వయంగా థమన్ కొన్నిసార్లు “అరవింద సమేత వీరరాఘవ” సినిమాకి ముందు తరువాత అని చెబుతుంటాడు.

మళ్ళీ త్రివిక్రమ్ దర్శకత్వంలో అలవైకుంఠపురంలో సినిమా థమన్ ను ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. అంతేకాకుండా త్రివిక్రమ్ తో మంచి సాన్నిహిత్యం దొరికింది థమన్ కి. పవన్ కళ్యాణ్ రీ ఎంట్రీ తరువాత చేసిన అన్ని సినిమాలకు థమనే మ్యూజిక్ డైరెక్టర్.

ఇక అసలు విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో ఆడియన్స్ అంతా చాలా తెలివైన వాళ్ళు అయిపోయారు. ఒక బిట్ చూసిన కూడా ఇది ఏ సినిమా నుండి లేపుకొచ్చారు టక్కున చెబుతారు. ఇలానే త్రివిక్రమ్ ఘన కార్యాలను చాలామంది మొన్న కరోనా టైం లో బయటకు తీశారు. ఇకపోతే థమన్ మీద ట్రోల్స్ అనేవి కొత్తేమి కాదు. ప్రస్తుతం థమన్ చేస్తున్న సినిమా “ఓజి” ఈ సినిమాకు కూడా అవకాశం త్రివిక్రమ్ వలన వచ్చింది అని ఇండస్ట్రీ టాక్, ఇకపోతే రీసెంట్ గా రిలీజైన “ఓజి” టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

- Advertisement -

సుజీత్ టేకింగ్ , విజువల్స్ కి మంచి బాక్గ్రౌండ్ స్కోర్ అందించాడు థమన్ అంటూ సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో ఎలివేషన్స్ ఇచ్చారు కొందరు. ఇంకొందరు మాకు ఉన్నాడు అనిరుద్ అన్నారు.

కానీ అసలు విషయం ఏంటంటే థమన్ ఓజి కి అందించిన బాక్గ్రౌండ్ స్కోర్, అచ్చం యూట్యూబ్ లో ఉన్న “Splasher” అనే వీడియో లోనిది. ఈ ముక్క తెలియక అనవసరంగా ఎలివేషన్ ఇచ్చాము కదరా బాబు అనుకుంటున్నారు కొందరు.

For More Updates :

Check out Filmify for the latest Movie updates, Movie Reviews, Ratings and all the Entertainment News.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు