Anirudh Remuneration: ఏంటి 10కోట్లా..? ప్రొడ్యూసర్లకు ఎందుకు అంత అతి?

Anirudh Remuneration

సినిమా కథ, కథనం ఎంత బాగున్నా, మ్యూజిక్ అనే మ్యాజిక్ తోడైతే వచ్చే రిజల్ట్ ఓ రేంజ్‌లో ఉంటుంది. అది ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం. యావరేజ్ కథకు పగిలిపోయే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఇస్తూ ఆడియన్స్‌ను ఇంప్రెస్ చేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్లు. ఇటీవల వచ్చిన జైలర్ మూవీని పరిశీలిస్తే, సినిమా ఫస్ట్ మాత్రమే బాగుంటుంది. సెకండాఫ్ వచ్చే సరికి, ల్యాగ్ సీన్స్, రోటీన్ స్టోరీతో డీలా పడుతుంది.

కానీ, జైలర్‌పై దాని ప్రభావం ఏ మాత్రం పడలేదు. దీనికి కారణం అనిరుధ్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అని ఎవరిని అడిగా చెబుతారు. దీన్ని అనిరుధ్ చక్కగా వాడుకుంటున్నాడు. డిమాండ్ ఉండటంతో దాన్ని రెమ్యూనరేషన్ వైపునకు మల్చుకుంటున్నాడు. ఇప్పటికే మ్యూజిక్ డైరెక్టర్లలలో అందరి కంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకుంటున్న అనిరుధ్, ఇప్పుడు ఒక్కో సినిమాకు 10 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడట. ఇప్పుడు రాబోయే సినిమాకు నిర్మాతల చేతిలో 10 కోట్ల చెక్ ఉంటేనే డేట్స్ ఇస్తున్నాడట. లేదంటే, సూటిగా కుదరదు అని చెప్పేస్తున్నాడట.

నిజానికి అనిరుధ్‌ను కోలీవుడ్‌కి మోనోపోలి అంటూ ట్రోల్స్ చేస్తారు. కొత్త వారిని ఎదగకుండా చేస్తాడని? అన్ని మూవీలకు తానే ఉండాలని వ్యవహరిస్తారని ఓ టాక్ కూడా ఉంది. అయినా కోట్ల రూపాయలు వెచ్చిస్తున్న ప్రొడ్యూసర్లు కూడా కొంత వరకు ఆలోచించాలి. ఎందుకంటే, యంగ్ మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది ఉన్నారు. వారికి ఛాన్స్ ఇవ్వక, బ్రాండ్ అనే పేరుతో ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కే రెమ్యూనరేషన్ 10 కోట్లు కేటాయిస్తున్నారు.

- Advertisement -

ఇటీవల వచ్చిన ఖుషి సినిమా ఎంత పెద్ద మ్యుజిక్ హిట్ అయిందో తెలిసిందే. హేషామ్ అబ్దుల్ వహాబ్ ఇచ్చిన మ్యూజిక్‌కు థియేటర్‌లో ఆడియన్స్ ఫిదా అయిపోయారు. అబ్దుల్ వహాబ్ కేవలం 1 కోటి రెమ్యూనరేషన్ తీసుకోవడం వల్ల, నిర్మాతలు ఆడియో ఆల్బమ్ అమ్ముకుంటే దాదాపు 12 కోట్ల లాభం వచ్చిందట.

అలాగే కోలీవుడ్‌లో జీవీ ప్రకాశ్ కూడా మ్యూజిక్ పగిలిపోయేలా ఇస్తున్నాడు. ఇలాంటి యంగ్ అండ్ టాలెంట్ మ్యుజిక్ డైరెక్టర్లు అందుబాటులో ఉన్నా, అదే అనిరుధ్, అదే తమన్ అంటూ పాత వాళ్లనే కోట్లు కుమ్మరించి తీసుకుంటున్నారు.

మళ్లీ వీళ్లు కూడా టైంకి అవుట్ పుట్ ఇవ్వలేరు. అనిరుధ్, తమన్ వల్ల ఇండస్ట్రీలో ఆగిపోయిన సినిమాల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతున్నాయన్న విషయం తెలిసిందే. అయినా, ఈ ప్రొడ్యూసర్లు అలాంటి హై డిమాండ్ ఉన్నవాళ్లనే తీసుకుంటున్నారే కానీ, అబ్దుల్ వహాబ్, జీ వీ ప్రకాశ్ లాంటి వాళ్లకి ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వడం లేదు.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు