Jailer Audio Launch: జైలర్ సినిమా చేయటానికి కారణం ఆయనే- నెల్సన్ కామెంట్స్ వైరల్

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా వస్తోన్న లేటెస్ట్ చిత్రం జైలర్ గురించిన ఇంట్రెస్టింగ్ విషయం ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరీ ఆ ఇంట్రెస్టింగ్ వైరల్ విషయం ఏ రూమరో అయ్యుంటుంది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇంట్రెస్టింగ్ వైరల్ విషయాన్ని చెప్పింది ఎవరో కాదు స్వయంగా జైలర్ సినిమా డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమారే !

రజనీకాంత్, తమన్నా హీరో హీరోయిన్స్ గా వస్తోన్న లేటెస్ట్ సినిమా జైలర్ ఆడియో లాంచ్ ఈవెంట్ నిన్న సాయంత్రం ఘనంగా జరిగింది. గత కొద్దీ రోజులుగా యూట్యూబ్ ను షేక్ చేస్తున్న జైలర్ సినిమా పాటల గురించి అందరికి తెలిసిందే. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ సినిమా పై ప్రేక్షకులలో భారీ అంచనాలున్నాయి. ప్రస్తుతం నిర్మాంణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఆగస్ట్ 10న గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది. ఇక ఈ సందర్భంగా నిన్న సాయంత్రం ఆడియో లాంచ్ ఈవెంట్ ను నిర్వహించారు మూవీ యూనిట్.

ఇక ఆడియో లాంచ్ ఈవెంట్ లో డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ మాట్లాడుతూ తాను జైలర్ సినిమా చేయటానికి మెయిన్ రీజన్ తలపతి విజయ్ అంటూ చెప్పుకొచ్చాడు. తన గత సినిమా బీస్ట్, ప్రేక్షకులను ఆశించినంతగా అలరించకపోవటంతో జైలర్ సినిమా రజనీకాంత్ తో చేయాలంటే కాస్త భయంగా ఉండేది. అప్పుడే తలపతి విజయ్ నాకు ధైర్యం చెప్పి జైలర్ సినిమా చేయటానికి కావాల్సిన ప్రోత్సాహం ఇచ్చాడు అంటూ ఆయన చెప్పుకొచ్చాడు. అలాగే తాను జైలర్ సినిమా చేయటానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అని చెబుతూ ఆయన స్పీచ్ ను ముగించగా తలపతి విజయ్ గురించిన నెల్సన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు